video viral:ఐదేళ్ల చిన్నారిని వేధించిన తల్లిపై కేసు.. ఆ సమయంలో తండ్రి లేరట..?
హోం వర్క్ చేయలేదని చిన్నారిపై ఓ తల్లి దేశ రాజధానిలో కర్కశత్వం చూపిన సంగతి తెలిసిందే. పొరుగింటి వారు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అయ్యింది. దీంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. చిన్నారి తల్లిపై చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే తల్లి అలా ప్రవర్తించిన సమయంలో.. ఇంట్లో ఎవరూ లేకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

10 నిమిషాలే ఉంచిందట
హోంవర్క్ చేయలేదని చిన్నారిపై తల్లి కఠినంగా వ్యవహరించింది. కాళ్లు, చేతులు కట్టేసి ఎర్రటి ఎండలో డాబాపై పడుకోబెట్టింది. ఎండ వేడికి తాళలేక చిన్నారి విలవిలలాడింది. పైన ఎండ, కింద డాబా వేడిని తట్టుకోలేక అల్లాడి పోయింది. అయినప్పటికీ ఆ తల్లి మనసు కరగలేదు. ఎర్రని ఎండలో ఉంచింది. స్థానికులు చిన్నారి బాధను వీడియో తీశారు. పోలీసులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. హోంవర్క్ చేయలేదనే ఇలా చేశానని.. కేవలం ఐదు పది నిమిషాలు మాత్రమే అలా ఉంచి.. తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చానని తెలిపింది.

తల్లిపై కేసు నమోదు
చిన్నారి నివాసం ఉంటోన్న ఖాజురీ కాస్ ఏరియాక పోలీసులు వచ్చారు. ఏం జరిగిందనే విషయం ఆరా తీశారు. పొరుగింటి వారు తీసిన వీడియోను చూపించారు. హోం వర్క్ చేయకపోవడంతోనే ఇలా చేశానని తెలిపింది. ఘటన జరిగిన సమయంలో తాను ఇంట్లో లేనని ఆమె తండ్రి చెప్పాడు. చిన్నారిపై కర్కశంగా ప్రవర్తించిన తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తండ్రి లేరట..
వాస్తవానికి రెండేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడ్డాయి. స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ కావడంతో.. పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే స్కూల్/ కాలేజీ చక్కగా నడుస్తోండగా..వేధించిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ ఘటనలో మాత్రం తల్లే కర్కశంగా ప్రవర్తించింది. అసలే ఎండలు మండుతుంటే ఆమె ఇలా చేయడం చర్చకు దారితీసింది. దీనిపై దుమారం చెలరేగగా.. పోలీసులు కూడా స్పందించి కేసు ఫైల్ చేశారు. అయితే తండ్రి మాత్రం తాను అక్కడ లేనని చెప్పి.. తప్పించుకునే ప్రయత్నం చేశాడు.












Click it and Unblock the Notifications