అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని.. అయిదు ఏళ్ల బాలికను కొట్టి చంపిన జంట!
ఒకరు ప్రైవేటు కాలేజీలో పీఈటీ, మరోకరు కంప్యూటర్ టీచర్, ఇద్దరు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా ఓ అభంశుభం తెలియని అయిదు సంవత్సరాల అమ్మాయిని కొట్టి హింసించారు... తమ కొత్త దాంపత్య జీవీతానికి అడ్డుగా ఉంటుందని భావించిన జంట, రెండు రోజుల పాటు తాటీమట్టలు, ప్లాస్టిక్ పైపులతో కొట్టి తీవ్రహింసలకు గురిచేశారు. దీంతో గాయాల పాలైన ఆ చిన్నారీ చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన తమిళనాడులో జరిగింది.
తమిళనాడులోని తిరుచి జిల్లా కేంద్రానికి సమీపంలో కట్టుపుత్తూర్ అనే గ్రామంలో నిత్యాకమలా మరియు ప్రసన్న ఇద్దరు భార్యభర్తలు,అయితే వారి ఇద్దరికి మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు.కాగా వారికి ఓ అయిదు సంవత్సరాల శ్రీ లతిక అనే అమ్మాయి కూడ ఉంది. అయినా ఇద్దరు కలిసి ఉండలేక విడాకులకు ధరఖాస్తు చేసుకున్నారు.కాగా ఆ కేసు కోర్టులో కొనసాగుతుంది. అయితే లతిక నిత్యాకమలతోనే ఉంటుంది. అయితే నిత్యకమల ఓ ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్ టీచర్‌గా పనిచేస్తుంది. దీంతో ఆమేకు అక్కడే పీఈటీగా ఉద్యోగం చేస్తున్న ముత్తు పాండీతోపాటు సహజీవనం కొనసాగిస్తుంది. దీంతో ఇద్దరు కలిసి ఊరు వదిలి దిండిగల్ అనే ప్రాంతానికి తరలి వెళ్లారు.

కాగా ఇద్దరి మధ్య అయిదు సంవత్సరాల లతిక ఉండడంతో తమ వైవాహిక జీవితానికి అడ్డువస్తుందని ముత్తు పాండీ భావించాడు. అమ్మాయిని ఇద్దరు కలిసి చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించారు.ఈనేఫథ్యంలోనే రెండు రోజుల పాటు నరకం చూపించారు. ఇంట్లో ఉన్న తాటీమట్టతో గోడ్డును బాదినట్టు బాదారు. అయిదేళ్ల అమ్మాయి అని కూడ చూడకుండా తీవ్రంగా కొట్టారు. ఇలా రెండురోజుల పాటు తాటీమట్టతోపాటు పీవీసీ పైపుతో ఆమే తీవ్రంగా కొట్టడంతో రెండు రోజు అమ్మాయి సృహతప్పి పడిపోయింది. దీంతో తీవ్రగా గాయలతో ఉన్న లతికను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు.
టీవీ చుస్తున్నందకు కొట్టామని చ
అయితే విషయం లతిక స్వంత తండ్రి ప్రసన్నకు తెలియడంతో హుటాహటిన ఆసుపత్రికి వెళ్లాడు. జరిగిన విషయం తెలుసుకున్న ప్రసన్న తీవ్రంగా కొట్టిన వారిపై కేసు ఫిర్యాదు చేశాడు. అసుపత్రిలో మాత్రం లతిక చదవకుండా ఎప్పుడ టీవీ చూస్తుండడంతో కొట్టామని చెప్పారు. తీవ్రగాయలైన లతిక చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. దీంతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications