వర్ష బీభత్సం: 50 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు.. ఎక్కడ అంటే..
ఉత్తరాదిలో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది. వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశాలో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. కొండచరియలు విరిగిపడటంతో పదుల సంఖ్యలో జనం చనిపోతున్నారు. ఇప్పటివరకు 50 మంది వరకు చనిపోయారని అధికారులు తెలిపారు.
వర్షబీభత్సం..
వందలాది గ్రామాలను వర్షాలు ముంచెత్తాయి. ఇళ్లలోకి బురదనీరు వచ్చింది. రహదారులు ఇబ్బందికరంగా మారాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బ్రిడ్జీలు కూడా ధ్వసం అయ్యాయి. మరో రెండు రోజులు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. వర్షాలతో ఐదుగురు గల్లంతయిన సంగతి తెలిసిందే. వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ మేరకు పీటీఐ వార్తాసంస్థకు ఓ అధికారి తెలియజేశారు.
50 మంది మృతి
వర్ష ప్రభావంతో 50 మంది చనిపోయారు. 12 మంది గాయపడ్డారు. వర్ష ప్రభావంతో మందీ, కంగ్రా, చాంబా జిల్లాల్లో ఎక్కువ ప్రభావం చూపించింది. గత మూడురోజులో ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లో 36 మంది చనిపోయారు. పునరావాస శిబిరాల్లో వందలాది మంది ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తరాఖండ్‌లో నలుగురు చనిపోయారు. 13 మంది గల్లంతయ్యారు. కొన్ని ఇళ్లు కొట్టుకుపోయాయి.
ఒడిశాలో ఆరుగురు మృతి
ఒడిశాలో ఆరుగురు చనిపోయారు. వర్షాలు, వరదలు 8 లక్షల మందిపై ప్రభావం చూపింది. వేలాది మంది ఇళ్లను కోల్పోయారు. వర్షాల వల్ల విద్యుత్‌కు అంతరాయం కలిగింది. మంచినీరు సరఫరా కూడా ఇబ్బందికరంగా ఉంది. రహదారులు దెబ్బతిన్నాయి.ఇప్పటివరకు లక్షా 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలతో జార్ఖండ్ నుంచి గాలుదిహ్ బ్యారేజీ ద్వారా వరదనీటిని విడుదల చేయడంతో ఉత్తర ఒడిశాలో గల అన్ని నదుల్లో నీటిమట్టం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటు జార్ఖండ్ రామ్ గఢ్ జిల్లాలో శనివారం నాల్కారీ నది ఉప్పొంగి ప్రవాహించింది. దీంతో ఐదుగురు కొట్టుకుపోగా.. నాలుగు మృతదేహాలను వెలికితీశారు. మరొకరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఇలా ఉత్తర భారతాన్ని వర్షాలు వణికిస్తున్నాయి.












Click it and Unblock the Notifications