రెండు సంవత్సరాల్లో 50 లక్షల ఉద్యోగాలు మటు మాయం : అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శీటి నివేదిక
భారత దేశం ఓవైపు ఉద్యోగాల కల్పనలో అనేక చర్యలు తీసుకుంటుందని చెబుతున్న నేపథ్యంలో మరోవైపు ఉన్న ఉద్యోగాలకే దిక్కులేని పరిస్థితి కనిపించిందని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో గత రెండెళ్లుగా 50 లక్షల ఫురుషుల ఉద్యోగాలు పోయాయని స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా పేరుతో అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఓ నివేదిక విడుద చేసింది. ఇందులో ఉద్యోగాలు పోవడానకి కారణాలను నిపుణులు విశ్లేషించారు.
ముఖ్యంగా నివేదికలో 2016 -18 మధ్య కాలంలో కేవలం పురుషులకు చెందిన ఉద్యోగాలే 50 లక్షల వరకు పోగట్టుకున్నట్టు నివేదికలో పేర్కోన్నారు. అయితే ఈసమయంలో నోట్ల రద్దు కార్యక్రమం వెలువడిందని అయితే ఇవి రెండు కూడ యాదృఛ్చికంగా జరిగాయని పేర్కోన్నారు. నోట్ల రద్దు ద్వార ఉద్యోకాలు ప్రత్యక్షంగా కోల్పోకపోయినా, ఉద్యోగాలు కోల్పోవడానికి మాత్రం నోట్ల రద్దుతోపాటు జీఎస్టీ ప్రవేశపెట్టడం కూడ కారణాలని పేర్కోంది. కాగా ఉద్యోగాలు పోగోట్టుకున్న వారిలో ఎక్కువగా డిగ్రి లేదా డిప్లోమా స్థాయికంటే తక్కువ విద్యార్హతలు ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం పడిందని తెలిపారు.

కాగా యువకుల్లో ఇది ఎక్కువగా కనిపించిందని ఇది పట్టణ మరియు గ్రామీణ ప్రాంత యువకులు కూడ ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. గడిచిన రెండెళ్లలో ఉద్యోగాలు కోల్పోతూ రావడంతో నిరుద్యోగిత పెరిగిందని చెప్పారు.కాగా ప్రస్థుతం ఉన్నత చదువులు ఉన్నవారికి ఉద్యోగాలు కల్పించాలనే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో తక్కువ స్థాయి విద్య ఉన్నవారికి కూడ ఉద్యోగాల కల్పనపై కూడ ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని నివేదిక సమర్పించిన నిపుణులు సూచించారు.కాగా 50 లక్షలు ఉద్యోగాలు కేవలం పురుషులకు సంబంధించినవే కాగా మహిళల ఉద్యోగాలు పరిగణలోకి తీసుకుంటే ఆ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడ వారు నివేదికలో పేర్కోన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications