నిధి కోసం మహిళను బలి ఇచ్చిన స్వామీజి
బెంగళూరు: గుప్త నిధి కోసం ఆశపడి ప్రత్యేక దేవుడి గది (స్వామీజి పూజలు చేసే ప్రత్యేక గది)లో మహిళను హత్య చేసిన సంఘటన కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని మడికేరి సమీపంలో జరిగింది. హత్య చేసిన స్వామీజిని, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
మడికేరి తాలుకా బోయకేరి గ్రామంలో ఆశ (50) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈమె ఒంటిపైకి కాళికాదేవి వస్తుందని స్థానికులు అంటున్నారు. అదే ప్రాంతంలో ధరణి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ధరణి ఇంటిలో ఇక్బాల్ స్వామి నివాసం ఉంటున్నాడు.

ఆశ నిత్యం తన శరీరంలోకి కాళికాదేవి వచ్చిందని చెబుతుండేది. ఇక్బాల్ స్వామికి కాళికాదేవి శరరీంలోకి వచ్చేదని, ఆయన నిత్యం పూజలు చేసేవాడని స్థానికులు అంటున్నారు. అందు వలన ఇక్బాల్ స్వామికి స్థానికులు కాళిదాస స్వామి అని పేరు పెట్టారు.
కాళికాదేవి ఆలయం నిర్మించడానికి ఇటివలన ఆషా ధరణి ఇంటి పక్కన స్థలం కొనుగోలు చేసింది. ఈమె కొనుగోలు చేసిన స్థలంలో గుప్త నిధి ఉందని చాల కాలం నుంచి ధరణి, ఇక్బాల్ స్వామి నమ్ముతున్నారు.ఆ స్థలంలోని నిధి తమకు దక్కాలంటే కాళికాదేవి శరీరంలోకి వచ్చే ఆశను బలి ఇవ్వాలని వీరు ప్లాన్ చేశారు.

సోమవారం మహాలయ అమావాస్య సందర్బంగా నరబలికి సిద్దం చేశారు. పూజలు చేస్తున్నామని నీవు రావాలని ఆశను నమ్మించి పిలుచుకుని వెళ్లారు. ఆమె ధరణి ఇంటి దగ్గరకు వెళ్లింది. రాత్రి ఇక్బాల్ స్వామికి చెందిన ప్రత్యేక దేవుడి గదిలో పూజలు మొదలు పెట్టారు. అనంతరం శరీరంపై పలుగాయాలై ఆశ శవమై కనిపించింది.
నిధి కోసం ధరణి, ఇక్బాల్ స్వామి కలిసి ఆశను చంపేశారని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి ధరణి, ఇక్బాల్ స్వామిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టుం నిర్వహించడానికి ఆశ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications