ఇంటికి పిలుస్తూ వివాహితపై పలుమార్లు అత్యాచారం

థానే: మహారాష్ట్రలోని థానేలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. మహారాష్ట్రలోని గణేష్‌పురికి ఓ గ్రామీణ రైతు 30 ఏళ్ల వివాహితపై పదే పదే థానేలో అత్యాచారానికి పాల్పడ్డాడు. 54 ఏళ్ల రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంబాడీ నాకాలోని నిందితుడు ప్రభాకర్ పాటిల్ పొలంలో బాధితురాలు కూలీగా పనిచేస్తూ ఉండేదని బీవండీ డివిజన్‌లోని గణేష్‌పురి పోలీసు స్టేషన్ ఎపిఐ డికె మతోంద్కర్ పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు. బాధితురాలి కూతురు తరుచుగా అనారోగ్యానికి గురవుతూ వస్తోంది. కూతురి చికిత్స కోసం సాయం చేస్తానని ప్రభాకర్ పాటిల్ బాధితురాలికి చెప్పాడు.

54-Year-Old Farmer Arrested for Raping Young Woman in Thane

అతను అవివాహితుడు. సాయం చేస్తాననే సాకుతో ఆమెను తరుచుగా తన ఇంటికి పిలిచి, ఆమెపై అత్యాచారం సాగిస్తూ వచ్చాడు. 2014 నవంబర్, డిసెంబర్ మధ్య కొంత కాలం అతను ఆమెను నిర్బంధించినట్లు కూడా ఆరోపణలున్నాయి.

తన కోరికను తీర్చకపోతే భర్తకు, కూతురికి హాని తలపెడుతానని కూడా అతను మహిళను బెదిరించాడు. ఆ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, అతన్ని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+