• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నాగా అసెంబ్లీ రికార్డు!: ఒక్క మహిళ కూడా ఎన్నికవ్వలేదు!!

By Swetha Basvababu
|

కోహిమా: నాగాలాండ్ ఏర్పాటై 54 ఏండ్లు..ఇప్పటి వరకు 12 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పటికీ రాష్ట్ర అసెంబ్లీకి ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. 60 స్థానాల నాగాలాండ్ అసెంబ్లీకి ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరుగనున్నది. మొత్తం 195 మంది అభ్యర్థుల్లో ఐదుగురే మహిళా అభ్యర్థులు. అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) మహిళా అభ్యర్థులనే నిలుపలేదు. 

దీనిపై అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) అధ్యక్షుడు షుర్హొజెలీ లియోజిస్తు మాట్లాడుతూ తమ పార్టీ మహిళా నేతల్లో ఏ ఒక్కరూ పోటీ చేసేందుకు సిద్ధంగా లేరని, వారు అసలు ఆసక్తి చూపడం లేదని తెలిపారు.

 ఎన్పీఎఫ్‌లోనే ముసలం తెచ్చిన నాగాలాండ్ ఉద్యమం

ఎన్పీఎఫ్‌లోనే ముసలం తెచ్చిన నాగాలాండ్ ఉద్యమం

గమ్మత్తేమిటంటే గత ఏడాది మున్సిపాలిటీల్లో మహిళా రిజర్వేషన్లను కల్పిస్తూ అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అధికార ఎన్పీఎఫ్ పార్టీలోనే అసమ్మతి గ్రూపు లేవనెత్తిన ఆందోళన సీఎం మార్పుకు దారి తీసింది. మహిళకు రిజర్వేషన్లు కల్పించడం నాగాలాండ్ సంస్క్రుతి సంప్రదాయాలకు వ్యతిరేకమని భారీ ఉద్యమమే సాగింది. రెండు జాతీయ రహదారులను స్తంభింపజేయడం.. ప్రభుత్వ కార్యాలయాల దహనం.. రాస్తారోకోలతో అట్టుడుడికింది.

ఎన్డీపీపీ పేరిట కొత్త పార్టీ ఆవిర్భావం ఇలా

ఎన్డీపీపీ పేరిట కొత్త పార్టీ ఆవిర్భావం ఇలా

అది చివరకు నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నుంచి నాగాలాండ్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) ఏర్పాటుకు దారి తీసింది. కాగా అయితే నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) తరఫున దిమాపూర్ త్రీ స్థానం నుంచి వెడియో యు క్రొను, నొక్సెన్ అసెంబ్లీ స్థానాల నుంచి మంగ్యాంగ్పు లా, ట్యెంగ్ సాంగ్ సదర్ టూ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాఖిల్లా పోటీ చేస్తున్నారు. రాఖిల్లా మినహా నలుగురు మహిళా అభ్యర్థులు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన వారు.

 ఎన్డీపీపీ అభ్యర్థిగా అవన్ కొన్యాక్ పోటీ

ఎన్డీపీపీ అభ్యర్థిగా అవన్ కొన్యాక్ పోటీ

గతంలో నాలుగు సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే లఖౌమొంగ్ 2006లో మరణించారు. ఆయన భార్యే రాఖిల్లా. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె కేవలం 800 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.కొత్త పార్టీ ఎన్డీపీపీ తరఫున అబోయి స్థానం నుంచి అవన్ కోయాంక్, చిజామీ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా రేఖారోజ్ దుక్రు పోటీ చేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో మరణించిన మాజీ ఎమ్మెల్యే నియోవాంగ్ కొన్యాంక్ కూతురు ఎన్డీపీపీ అభ్యర్థి అవాన్ కోన్యాక్. ఈ సందర్భంగా అవాన్ కొన్యాక్ మాట్లాడుతూ ప్రతిరోజూ సమాజం కోసం మహిళలు గణనీయ సేవలందిస్తారని, కానీ వారి సమస్యలను నేతలు తరుచుగా నిర్లక్ష్యం చేస్తారని ఆరోపించారు. తాను మహిళా సాధికారత, లింగ సమానత్వంపైనే ద్రుష్టి సారించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

విధాన నిర్ణయాల్లో మహిళలను ప్రోత్సహించాలన్న సామాజిక కార్యకర్త

విధాన నిర్ణయాల్లో మహిళలను ప్రోత్సహించాలన్న సామాజిక కార్యకర్త

నాగా మదర్స్ అసోసియేషన్ (ఎన్ఎంఏ) సలహాదారు రోజ్ మేరీ డువిచు మాట్లాడుతూ ఈ సారి ఎన్నికల్లో ఐదుగురు మహిళలు పోటీ చేసేందుకు సిద్ధం కావడం తమకు ఆనందంగా ఉన్నదన్నారు. ఆయా అసెంబ్లీ స్థానాల్లో మహిళా ఓటర్లంతా మహిళా అభ్యర్థులకే ఓట్లేసి మద్దతునివ్వాలని కోరారు. సామాజిక కార్యకర్త ఎలూ నడాంగ్ మాట్లాడుతూ పురుషులతోపాటు మహిళ ప్రాతినిధ్యం చాలా ముఖ్యమన్నారు. విదాన నిర్ణాయక సంస్థల్లో నాగా మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు.

 మహిళా అభ్యర్థులకు ఇలా ఎన్నికల అధికారి స్వాగతం

మహిళా అభ్యర్థులకు ఇలా ఎన్నికల అధికారి స్వాగతం

ఎన్సీపీ అభ్యర్థి వైడియో యు క్రొను మాట్లాడుతూ అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేయడం చాలా కష్ట సాధ్యం అన్నారు. అయితే పోటీలో ఉన్న ఐదుగురు మహిళా అభ్యర్థులు కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మహిళా అభ్యర్థులకు నాగాలాండ్ ఎన్నికల ప్రధానాధికారి అభిజిత్ సిన్హా స్వాగతం పలికారు. గత ఎన్నికలతో పోలిస్తే మహిళా అభ్యర్థుల సంఖ్య ఇద్దరి నుంచి ఐదుగురికి పెరిగిందన్నారు. 1977లో యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ తరఫున రానొ షైజా అనే మహిళా నేత తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనారోగ్యంతో 2015లో ఆమె మృతి చెందారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Even after 54 years of statehood and 12 assembly elections, Nagaland is yet to see any woman representative in the Assembly. The state is set to go to polls on February 27 and the results will be announced on March 3. Of the 195 candidates vying for a seat in the 60-member Assembly this time, five are women.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more