శబరిమల సన్నిధానంలో తీవ్ర విషాదం

శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి రెండు రోజుల్లో ఆ అయ్యపుడిని దర్శించుకున్న స్వాముల సంఖ్య రెండు లక్షలను దాటిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నేడు మూడో రోజు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. అయ్యప్ప స్వాములతో సన్నిధానం క్రిక్కిరిసిపోతోంది. క్యూలైన్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. 18 మెట్ల వద్ద భక్తుల సంఖ్య మరింత అధికంగా కనిపిస్తోంది.

స్వామివారి దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. ఫలితంగా క్యూలైన్లల్లో తొక్కిసలాట తరహా వాతావరణం చోటు చేసుకుంటోంది. మంగళవారం రాత్రి పలువురు స్వాములు సృహ తప్పారు. వేచివుండలేక సొమ్మసిల్లిపోయారు. వీరిని ట్రావెన్ కూర్ దేవస్వొం బోర్డు సిబ్బంది హుటాహుటిన ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఓ మహిళ భక్తురాలు మరణించారు. ఆమె కోయిలాండి నుంచి వచ్చినట్లు బోర్డు వెల్లడించింది.

58-Year-Old Woman Passes Away During Unprecedented Rush at Sabarimala Pilgrimage

ఆమె మృతదేహాన్ని బోర్డు ఖర్చుతో స్వస్థలానికి తరలిస్తామని టీడీబీ తెలిపింది. మండలం-మకరవిళక్కు సీజన్ ప్రారంభమైన 48 గంటల్లోనే దాదాపు రెండు లక్షల మంది భక్తులు ఆలయానికి చేరుకోవడంతో అయ్యప్ప స్వామి దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. దీంతో పలువురు స్వాములు బ్యారికేడ్లను దాటి, సన్నిధానానికి చేరుకోవడానికి ప్రయత్నించారు. వారిని నియంత్రించడంలో దేవస్వొం బోర్డు సిబ్బంది, పోలీసులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోన్నారు.

ఆలయానికి వెళ్లే 18 మెట్ల వద్ద భారీ సంఖ్యలో భక్తులు గుమికూడారు. ఈ రద్దీలో చిన్నపిల్లలు తల్లిదండ్రుల భుజాలపైకి ఎక్కి ఏడుస్తూ కనిపించారు. గంటల తరబడి క్యూలలో నిలబడిన భక్తులకు నీటి కొరతతో ఇబ్బందులకు గురయ్యారు. దేవస్వొం బోర్డు ఛైర్మన్ జయకుమార్ స్పందించారు. స్వాములకు మంచినీరు, ఇతర తేలికపాటి ఆహార పదార్థాలను అందించడానికి 200 మంది అదనపు సిబ్బందిని మోహరించామని తెలిపారు. క్యూలను దాటకుండా దర్శనానికి వెళ్లాలని సూచించారు.

సన్నిధానంలో భక్తుల సంఖ్య పెరగడంతో నీలక్కల్ వద్ద రద్దీని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. అదనపు స్పాట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. పంబా నుండి వచ్చే భక్తుల రాకపై పరిమితులు విధించారు. శబరిమలలో ప్రవేశాన్ని రోజుకు లక్ష మందికి పరిమితం చేసినప్పటికీ.. దీన్ని మరింత కుదించారు. స్పాట్ బుకింగ్‌లు రోజుకు 20,000 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు. పరిస్థితి నియంత్రణలోనే ఉందని అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ శ్రీజిత్ చెప్పారు. స్పాట్ బుకింగ్‌లకు అధిక డిమాండ్ ఉంటోందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+