• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముదిరిన వివాదం: ఉన్నట్టుండి అమెరికాకు విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా: ఆ సర్వీసులివే

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అందుబాటులోకి తీసుకొస్తోన్న 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ అంశం ముదురుతోంది. పౌర విమానయాన సంస్థలు తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేస్తోన్నాయి. ఎయిర్‌పోర్టులు, రన్‌వేలు ఈ నెట్‌వర్క్‌ పరిధిలకి తీసుకుని రావడం వల్ల విమానాల భద్రతకు పెను ముప్పు వాటిల్లుతుందని, 5జీ నెట్‌వర్క్ వల్ల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో అనూహ్య పరిణామాలు సంభవించే ప్రమాదం ఉందని భావిస్తోన్నాయి.

తమ దేశంలో 50 విమానాశ్రయాల పరిధిలోద 5జీ ట్రాన్స్‌పాండర్లను నెలకొల్పడానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఏటీ అండ్‌ టీ, వెరిజోన్ సంస్ధలు వాటిని నెలకొల్పుతున్నాయి. దీన్ని పలు పౌర విమానయాన సంస్థలు వ్యతిరేకించాయి. ప్రభుత్వానికి లేఖలు సైతం రాశాయి. దేశంలో ఎక్కడైనా 5జీ టెక్నాలజీని ప్రవేశపెట్టవచ్చని.. విమానాశ్రయాలు, రన్‌వేలను ఇందులో నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరాయి. రన్‌వేలకు కనీసం రెండు కిలోమీటర్ల చదరపు వైశాల్యంలో 5జీని ప్రవేశపెట్టవద్దని సూచించాయి.

యూపీఎస్ ఎయిర్ లైన్స్, అలస్కా ఎయిర్ లైన్స్, అట్లాస్ ఎయిర్, జెట్ బ్లూ ఎయిర్‌వేస్, ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశాయి. ఎయిరిండియా కూడా 5జీ నెట్‌వర్క్ ఏర్పాట్ల పట్ల విముఖతను తెలిపింది. అమెరికాలోని ప్రధాన నగరాలకు నడిపిస్తోన్న విమాన సర్వీసులను రద్దు చేసింది. ఎనిమిది విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిరిండియా వెల్లడించింది. అమెరికా చేపట్టిన 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ ప్రాజెక్ట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.

5G threat to Airline Safety: Air India cancels 8 US flights

ప్రస్తుతానికి ఎనిమిది విమాన సర్వీసులను రద్దు చేశామని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని అరున్ కుమార్ చెప్పారు. ఢిల్లీ-న్యూయార్క్, న్యూయార్క్-ఢిల్లీ, ఢిల్లీ-చికాగో, చికాగో-ఢిల్లీ, ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో, శాన్‌ఫ్రాన్సిస్కో-ఢిల్లీ, ఢిల్లీ-నెవార్క్, నెవార్క్-ఢిల్లీ మధ్య విమాన సర్వీసులను రద్దు చేశామని వివరించారు. కాగా- అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ భారత్‌కు నేరుగా విమానాలను నడిపిస్తోన్నాయి. అవి కూడా తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయా? లేదా అనేది తెలియరావాల్సి ఉంది.

ఒక్క ఎయిరిండియా మాత్రమే కాకుండా.. ఎమిరేట్స్, జపాన్ ఎయిర్‌లైన్స్, ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ వంటి పలు విదేశీ సంస్థలు కూడా అమెరికా చేపట్టిన ఈ 5 నెట్‌వర్క్ పట్ల ఆందోళనలను వ్యక్తం చేస్తోన్నాయి. సింగపూర్ ఎయిర్‌లైన్స్.. టోక్యో మీదుగా లాస్‌ఏంజెలిస్‌కు నడిపించే విమానాన్ని మార్చివేసింది. బోయింగ్‌కు బదులుగా ఎయిర్‌బస్‌ను ప్రవేశపెట్టింది. 5జీ నెట్‌వర్క్ విస్తరణ పట్ల ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది ఉత్కంఠతను రేపుతోంది.

English summary
After the rollout of 5G wireless networks in the United States, India has cancelled eight Air India flights to and from the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X