వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంపించిన శ్రీనగర్-ఢిల్లీ: పరుగులు తీసిన జనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లో 6.1 తీవ్రతతో భూమి తీవ్రంగా కంపించింది. ఆ ప్రభావం ఉత్తర భారతదేశంపైనా పడింది. శ్రీనగర్ నుంచి ఢిల్లీ వరకు కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ ప్రకంపనలు దాదాపు 40 సెకన్లపాటు కొనసాగినట్లు సమాచారం.

భూమి కంపించడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు నివాసాలను వదిలి బయటికి పరుగులు తీశారు. ఈ ప్రకంపనల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఇటీవల 7.9 తీవ్రతతో నేపాల్ సంభవించిన భూ ప్రకంపనల ప్రభావం ఉత్తర భారతదేశంలోని బీహార్, పశ్చిమబెంగాల్, ఇతర పలు రాష్ట్రాలపై పడింది. ఇది ఇలా ఉండగా, 6.6 తీవ్రతతో పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, పెషావర్ ప్రాంతాలు కంపించాయి.

6.1 magnitude earthquake hits Afghan border; tremors felt across North India

లోయలో పడిన లారీ: ఏడుగురి మృతి

లారీ లోయలో పడి ఏడుగురు మృత్యువాతపడిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తురైవూర్‌ ప్రాంతానికి చెందిన కొంతమంది లారీలో వెళుతుండగా.. ప్రమాదవశాత్తు లారీ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు.

మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. జిల్లా కలెక్టరు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

English summary
A powerful earthquake of 6.1 magnitude jolted the northern Afghanistan border on Monday, Aug 10.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X