వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ, పంజాబ్, జమ్మూకాశ్మీర్, నోయిడాలో భూకంపం: భయంతో పరుగులు తీసిన జనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరభారతదేశంలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో రిక్టారు స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతేగాక, ఢిల్లీ-ఎన్సీఆర్, జమ్మూకాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.

ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలంతా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు సెకన్లపాటు భూమి కంపించిందని పలువురు తెలిపారు. ఇళ్లల్లోని వస్తువులు స్వల్పంగా కదలాడాయని చెప్పారు.

 6.1 magnitude earthquake rocks Amritsar, tremors felt in Delhi-NCR, J & K, across north India

ఆఫ్ఘనిస్థాన్, నేపాల్‌లోని హిందూఖుష్ పర్వతాల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. హిందుఖుష్ పర్వతాల కారణంగానే తరచూ భూకంపాలు సంభవిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో కూడా శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. కజకిస్థాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

జాతీయ రాజధాని భూకంప జోన్ IV క్రిందకు వస్తుంది - ఇది చాలా ఎక్కువ రిస్క్ జోన్. భూకంపాల పెరుగుతున్న తీవ్రత, పౌన:పున్యం ప్రకారం భారతదేశం II, III, IV, V - నాలుగు భూకంప మండలాలుగా విభజించబడింది.

ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని, అందరూ సుక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

2005 తర్వాత ఇక్కడ భూకంపం సంభవించిందని, భయంతో తాను ఒక బ్లాంకెట్ తీసుకుని బయటకు పరుగుతీశానని జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్టర్ లో వెల్లడించారు. ఆ తొందరలో తాను ఫోన్ కూడా తీసుకోకుండా పరుగు తీసినట్లు చెప్పారు.

English summary
A 6.1 magnitude earthquake rocked Amritsar's Punjab while strong tremors were felt in Delhi-NCR, Jammu and Kashmir, Punjab, Himachal Pradesh, Haryana and Uttar Pradesh for several seconds on Friday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X