వాయుసేన స్థావరాలపై భారీ దాడికి లష్కరే కుట్ర.. హై అలర్ట్ ప్రకటన!

ఉత్తరప్రదేశ్‌లోని వాయుసేన స్థావరాలపై పెద్ద ఎత్తున దాడి జరిపేందుకు లష్కరే తొయిబా ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని వాయుసేన స్థావరాలపై పెద్ద ఎత్తున దాడి జరిపేందుకు లష్కరే తొయిబా ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. యూపీలోని భారత్-నేపాల్ సరిహద్దు వెంబడి హైఅలర్ట్ ప్రకటించింది.

ఆరు నుంచి ఏడుగురు లష్కరే ఉగ్రవాదులు వాయిసేన స్థావరాలను, ముఖ్యంగా ఘజియాబాద్‌లోని హిండన్ వద్దనున్న ఐఎఎఫ్ స్థావరంపై దాడికి కుట్ర పన్నినట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'రా' (ఇంటెలిజెన్స్ అండ్ అనాలసిస్ వింగ్) ఓ నివేదికలో హెచ్చరించింది.

6-7 Lashkar terrorists planning to attack Air Force bases in UP, alert in place

బుధవారం ఉదయం ఘజియాబాద్‌లోని వాయిసేన హిండన్ బేస్ గోడను దాటేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించడంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆ వ్యక్తి గాయపడ్డాడు. అయితే ఈ ఘటనకూ, ఇంటెలిజెన్స్ నివేదికకూ సంబంధం ఎదైనా ఉందా? అనేది ఇంకా తెలియలేదు.

లష్కరే ఉగ్రవాదులు ఏకే 47 రైఫిల్స్, గ్రనేడ్ లాంఛర్లు, హ్యాండ్ గ్రనేడ్లతో దాడులు జరపవచ్చని ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది. కాగా, 'రా' ఇచ్చిన సమాచారాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో నిశితంగా పరిశీలిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+