ప్రైవేట్ బస్సు పల్టీ కొట్టి ఆరు మంది దుర్మరణం, 20 మందికి తీవ్రగాయాలు, డ్రైవర్ నిర్లక్ష్యం !

బెంగళూరు: వేగంగా వెలుతున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఆరు మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెంది 20 మందికి పైగా తీవ్రగాయాలైన సంఘటన కర్ణాటకలోని తుమకూరు సమీపంలో జరింది. తీవ్రగాయాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

బుధవారం విజయలక్ష్మి ట్రావెల్స్ అనే ప్రైవేటు బస్సు కొరటగెరె నుంచి తుమకూరుకు బయలుదేరింది. మార్గం మధ్యలో కొరటగెరె సమీపంలో వేగంగా వెలుతున్న బస్సు రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. ఆ సమయంలో అదుపుతప్పిన బస్సు ఒక్కసారిగా పల్టీ కొట్టింది.

 6 Dead 20 Injured In A BUS Accident in Koratagere Near Tumkur in Karnataka

ఈ ప్రమాదంలో ఆరు మంది ప్రయాణికులు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. విషయం గుర్తించిన స్థానికులు భాదితులను రక్షించడానికి ప్రయత్నించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు భాదితులను తుమకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.

తీవ్రగాయాలైన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారని పోలీసులు అన్నారు. తుమకూరు- కొరటగెరె మార్గంలో ప్రైవేటు బస్సులు విచ్చలవిడిగా అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకుని వెలుతున్నారని, బస్సులను డ్రైవర్లు ఇష్టం వచ్చినట్లు నిర్లక్షంగా వేగంగా నడపడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. కేసు నమోదు చేసిన కొరటగెరె పోలీసులు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+