నూడుల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు: ఆరుగురు మృతి, 12 మందికి తీవ్రగాయాలు
పాట్నా: బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో నూడుల్స్ తయారీ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శ్రీకృష్ణా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది.

ఈ ఫ్యాక్టరీ ముజఫర్పూర్ లోని బేలా ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉంది. ప్రమాదం జరిగే సమయంలో ఆ ఫ్యాక్టరీలో ఎంత మంది పనిచేస్తున్నారన్న సమాచారం కూడా తెలియరాలేదు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఫ్యాక్టరీలోని బాయిలర్ పెద్ద శబ్ధంతో పేలిపోయింది.
ఈ శబ్ధం సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందని స్తానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications