అసోంలో బాంబు పేలుడు, ఆరుగురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
గువాహతి : అసోంలో తీవ్రవాదులు బీభత్సం సృష్టించారు. బుధవారం సాయంత్రం గువాహితిలో జూ రోడ్డులో గల షాపింగ్ మాల్ వద్ద బాంబు పేల్చారు. దీంతో ఆరుగురు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇద్దరి పరిస్థితి విషమం ...
పేలుడులో ఆరుగురు గాయపడగా .. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తర్వాత వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు తరలించారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పేలుడుకు పాల్పడింది తామేనని ఉల్ఫా తీవ్రవాద సంస్థ పేర్కొంది. ఉల్ఫా-1 తీవ్రవాద సంస్థకు పరేశ్ బర్షా నేతృత్వం వహిస్తున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు కమిషనర్ దీపక్ కుమార్ పేర్కొన్నారు. ఈ పేలుడు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అసోం సీఎం శర్బానంద సోనోవాల్ డీజీపీని ఆదేశించారు.












Click it and Unblock the Notifications