చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత ఆస్తుల కేసు తేలేది ఎప్పుడు: శశికళ నాలుగేళ్లు వెయిట్ చేయాలా?

జయలలిత మృతి, తమిళనాడులో.. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీలో రాజకీయం రసవత్తరంగా మారింది. శశికళ పార్టీ పగ్గాలు.. ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం పావులు కదుపుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జయలలిత మృతి, తమిళనాడులో.. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీలో రాజకీయం రసవత్తరంగా మారింది. శశికళ పార్టీ పగ్గాలు.. ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం పావులు కదుపుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి జయలలిత అక్రమాస్తుల కేసు వైపు మళ్లింది.

మోడీని కలవనున్న శశికళ: సవాల్.. చిన్నమ్మకు ఆ పదవి సులభం కాదా?మోడీని కలవనున్న శశికళ: సవాల్.. చిన్నమ్మకు ఆ పదవి సులభం కాదా?

ప్రస్తుతం జయలలిత అక్రమాస్తుల కేసు పైన సుప్రీం కోర్టులో ఉంది. శశికళ భవితవ్యం సుప్రీం కోర్టు తీర్పు పైన ఆధారపడి ఉంది. జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమెతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు ఉన్నారు. ఈ కేసు పైన తీర్పును సుప్రీం కోర్టు ఆరు నెలల క్రితం రిజర్వ్‌లో ఉంచింది.

అయితే, కేసు పైన తీర్పు ఎప్పుడు వెల్లడిస్తామనే విషయాన్ని చెప్పలేదు. దీంతో ఇప్పుడు అందరి చూపు కేసు వైపు మళ్లింది. ఎప్పుడు వెళ్లడిస్తామని చెప్పనందున.. ఆ కేసు పైన తీర్పు కోసం తమిళనాట అందరు ఎదురు చూస్తున్నారు.

jayalalithaa

ప్రస్తుతం తమిళనాట శశికళ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. జయలలిత మృతి నేపథ్యంలో కేసు ఏమవుతుందనే ప్రశ్న పలువురిని తొలుస్తోందట.

ఏదైనా కేసులో ఒక్కరే నిందితులు ఉంటే ఆ కేసు వేరు. కానీ ఇక్కడ జయలలిత తొలి ముద్దాయి. ఆ తర్వాత శశికళతో పాటు మరో ఇద్దరు నిందితులు ఉన్నారు. తొలి ముద్దాయి చనిపోయినా మిగతా ముగ్గురు ఉన్నారు. జయ మృతి నేపథ్యంలో ఆమె పేరు లేకున్నా, మిగతా ముగ్గురు నిందితులు ఉన్నారు.

శశికళ రాజకీయ భవిష్యత్తు సుప్రీం కోర్టు తీర్పు పైనే..

సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు చెబుతుందో ఎవరికీ తెలియడం లేదు. ఆ తీర్పు కోసం ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ట్రయల్ కోర్టు వారికి శిక్ష విధించింది. బెంగళూరు హైకోర్టు వారిని నిర్దోషులుగా తేల్చింది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టులో తీర్పు రావాల్సి ఉంది.

ట్రయల్ కోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థిస్తే.. శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు మరో నాలుగేళ్ల పాటు జైలు జీవితం గడపవలసి ఉంటుంది.

ఈ ఏడాది జూన్ 7వ తారీఖున సుప్రీం కోర్టు ఈ కేసును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు చెప్పింది. జస్టిస్ పీసీ ఘోష్, అమితావా రాయ్ బెంచ్ దీనిని రిజర్వ్ చేసింది. ఈ కేసు పైన తీర్పుకు టైమ్ ఫ్రేమ్ లేదని, అయితే జడ్జిలు రిటైర్ అయ్యేలోపు మాత్రం వస్తుందని అంటున్నారు.

శశికళను జయలలిత పార్టీ నుంచి తోసేశారు, పదవి రేసులో నేను: శశికళ పుష్పశశికళను జయలలిత పార్టీ నుంచి తోసేశారు, పదవి రేసులో నేను: శశికళ పుష్ప

తీర్పు తమిళ రాజకీయాల్లో కీలకం

సుప్రీం కోర్టు తీర్పు తమిళనాడు రాజకీయాలకు చాలా కీలకం కానుంది. ముఖ్యంగా జయలలిత తర్వాత పదవుల కోసం ఉబలాటపడుతున్న శశికళ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించింది. సుప్రీం కోర్టు.. ట్రయల్ కోర్టు శిక్ష తీర్పును సమర్థిస్తే మరో నాలుగేళ్ల పాటు శశికళ జైలులో ఉండవలసి ఉంటుంది. అప్పుడు శశికళ రాజకీయాల కోసం మరో నాలుగేళ్లు తన ఆగాల్సి ఉంటుంది. తీర్పు అనుకూలంగా ఉంటే మాత్రం ఆమె పార్టీ పగ్గాలు, ఆ తర్వాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టవచ్చు.

English summary
SC will play a key role in deciding Sasikala Natarajan's future as it hands out verdict in the disproportionate assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X