పుల్వామా ఎన్‌కౌంటర్: ఆరుకు చేరిన జవాన్ల మృతి
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన భద్రతా సిబ్బంది సంఖ్య ఆరుకు చేరింది. భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన భద్రతా సిబ్బంది సంఖ్య ఆరుకు చేరింది. భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు.
మరింతమంది ఉగ్రవాదులు పుల్వామా జిల్లాలో సంచరిస్తున్నట్టు భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఆత్మాహుతి దళ సభ్యులుగా భావిస్తున్న ఆ ముష్కరులను ఏరివేసేందుకు భద్రతా దళాలు ప్రస్తుతం భారీ ఆపరేషన్ చేపట్టాయి.

శనివారం తెల్లవారుజామున పుల్వామాలో పోలీసు లైన్ల వద్ద కాపలాగా ఉన్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. ఈ దాడి నేపథ్యంలో సమీప ప్రాంతంలో ఉన్న కుటుంబాలన్నింటినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఉగ్రవాదులకు బందీలుగా ఎవరు చిక్కలేదని, ఇతర ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టేందుకు అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపామని జమ్మూకశ్మీర్ పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications