ఉల్లిగడ్డతో కూతురు ప్రాణం తీసిన తండ్రి

Subscribe to Oneindia Telugu

ఔరంగాబాద్: ఓ తండ్రి అనుకోకుండా తన కూతురు ప్రాణం తీశాడు. ఆరేళ్ల చిన్నారికి విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో ఆమె చేసిన చిన్న పొరపాటు ఆమె ప్రాణం తీసింది. చిన్నారి తప్పు చెప్పడంతో ఆమెను శిక్షించేందుకు చెంప దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత రోదించడంతో ఓ ఉల్లిగడ్డను ఆమె నోట్లో కుక్కాడు. దీంతో ఆ చిన్నారి ఊపిరాడక చనిపోయింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని బేలాపూర్ అనే గ్రామంలో చోటు చేసుకుంది.

జులై 9న జరిగిన ఈ ఘటనపై నిందితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్ కూటే (32) ‌కుమార్తె భారతి(6). ఆమెను గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. కాగా, సంజయ్ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

6-Year-Old Failed To Count, Choked To Death By Father With Onion

గత శనివారం రాత్రి తన కుమార్తె ఎలా చదువుతోందోనని పరీక్ష చేశాడు. 1 నుంచి 15 వరకు అంకెలు చెప్పమన్నాడు. అయిదే, ఆచిన్నారి 12ను మరచిపోయింది. దీంతో సంజయ్ తీవ్ర ఆగ్రహంతో ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. చిన్నారి ఏడుస్తూ ఉండటంతో నోట్లో ఉల్లిపాయ కుక్కాడు. దీంతో ఆ చిన్నారి ఊపిరాడక కుప్పకూలిపోయింది.

వెంటనే సంజయ్ ఆ బాలికను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్ళాడు. కాగా, ఆమె మరణించిందని డాక్టర్లు చెప్పారు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా గ్రామంలోని శ్మశానంలో అంత్యక్రియలు చేసేశారు. కడుపుకోత భరించలేక రెండు రోజుల తర్వాత ఆ చిన్నారి తల్లి.. పోలీసులకు తన భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో ఈ దారుణం వెలుగుచూసింది. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A six-year-old girl was choked to death allegedly by her father after he lost his cool over her failure to count numbers, near Aurangabad, police said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి