60 ఏళ్ల వృద్దురాలిపై కాల్పులు, గల్లీలో రెండు రౌండ్ల ఫైరింగ్, వీడియో తీయడంలో బిజీగా ఉన్న జనం..
సమాజ పోకడో ఏంటో కానీ మనుషుల్లో మార్పు వస్తోంది. కొందరు వీధుల్లోకి వచ్చి తుపాకులతో ఫైర్ చేసే సిచుయేషన్ వచ్చింది. అయితే ఆ సమీపంలో ఉన్న మరికొందరు కాపాడే ప్రయత్నం చేయడం మానేసి.. తమ ఫోన్‌లో వీడియో తీసేందుకు ఇష్టపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటన ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తోంది.
ఏం జరిగిందో తెలియలేదు, ఆ వృద్దురాలితో ఏం గొడవ తెలియదు.. కానీ కస్గాంజ్ ప్రాంతంలో వృద్దురాలిని ఒకడు బెదిరిస్తున్నాడు. దేశీయ తుపాకీ పట్టుకొని వార్నింగ్ ఇస్తుండగా ఆమె వణికిపోయింది. సాయం చేయాలని అరిచింది. కానీ ఇరుగు పొరుగు వారు దాబాపై నుంచి జరుగుతోన్న లైవ్‌ను చూస్తున్నారు. కానీ ఒక్కడు కూడా ముందుకురాలేదు. తన ఇంటి సందులో ఇద్దరికీ వాగ్వివాదం జరుగుతోంది. ఇంతలో వృద్దురాలు ఇంట్లోకి వెళదామనుకునేలోపు అతను షూట్ చేశాడు. దీనిని అక్కడున్న కొందరు తమ ఫోన్లలో బందించేందుకు తెగ ఉత్సాహం చూపించారు.

అతడు షూట్ చేయడంతో ఆమె పడిపోయింది. అయినా ఎవరికీ మనసు రాలేదు. రెండోసారి షూట్ చేయడంతో ఆ ముసలి ప్రాణం వెళ్లిపోయింది. కాల్పులు జరిపిన మోను అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి ఆశ్రయం ఇచ్చినవారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వృద్దురాలిపై కాల్పులు జరిపే సమయంలో ఆపకుండా వీడియో తీసిన వారిపై చట్టపరమైన చర్య తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications