వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల మరణాలపై ఎట్టకేలకు బీజేపీ ప్రకటన -కేవలం 68 మందే చనిపోయారన్న హర్యానా మంత్రి

|
Google Oneindia TeluguNews

సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు ఢిల్లీ శివారుల్లో చేస్తోన్న నిరసనలు సోమవారం నాటికి 102వ రోజు పూర్తయ్యాయి. ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడంతోపాటు ఎన్నికలు జరుగుతోన్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో చర్చల ప్రక్రియ దాదాపు నిలిచిపోయింది. కాగా, రైతుల మరణాలపై బీజేపీ ఎట్టకేలకు అధికారికంగా స్పందించింది.

ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల్లో ఇప్పటివరకు 68 మంది మృతిచెందినట్టు హర్యానా హోం మంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు. వివిధ కారణాల వల్ల వారు ప్రాణాలు కోల్పోయారని సోమవారం అసెంబ్లీలో ఆయన వెల్లడించారు. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొన్నారు.

 ప్రజలు నపుంసకులు -ఏపీలో మగాళ్లు లేరు -రఘుగాడినే వేశామన్నది జగన్ లెక్క: వైసీపీ ఎంపీ అనూహ్యం ప్రజలు నపుంసకులు -ఏపీలో మగాళ్లు లేరు -రఘుగాడినే వేశామన్నది జగన్ లెక్క: వైసీపీ ఎంపీ అనూహ్యం

68-protesting-farmers-died-at-state-borders-with-delhi-haryana-minister

రైతుల ఉద్యమంలో మృతిచెందిన వారిలో 21 మంది రైతులు హర్యానాకు చెందినవారు కాగా, 47 మంది పంజాబ్‌కు చెందినవారు ఉన్నారని మంత్రి విజ్ తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ మూడు నెలలకు పైగా కొనసాగుతున్న ఈ పోరాటంలో మృతిచెందిన రైతుల కుటుంబాలకు ఉద్యోగం కల్పించడం, ఆర్థిక సాయం చేయడం వంటి ప్రతిపాదనలేవీ తమ వద్ద లేవని మంత్రి స్పష్టంచేశారు.

మూడు నెలలకుపైగా కొనసాగుతోన్న ఉద్యమంలో 200మందికిపైగా రైతులు చనిపోయారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. వారందరినీ అమరలుగా గుర్తించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైతుల మరణాలపై కేంద్రం స్పందించనప్పటికీ, బీజేపీకే చెందిన హర్యానా సర్కారు తొలిసారి అధికారిక ప్రకటన చేసింది.

సోనోవాల్‌కు బీజేపీ హైకమాండ్ షాక్ -సిట్టింగ్ సీఎంపై అపనమ్మకం -ఫలితాల తర్వాతే పేరు ప్రకటనసోనోవాల్‌కు బీజేపీ హైకమాండ్ షాక్ -సిట్టింగ్ సీఎంపై అపనమ్మకం -ఫలితాల తర్వాతే పేరు ప్రకటన

English summary
68 people have died due to varied reasons while protesting against the centre's farm laws at the state borders with Delhi, Haryana Home Minister Anil Vij told the Assembly on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X