పెళ్లి: వరుడు స్నేహితులు దుర్మరణం, ఏడుగురు నుజ్జు, నజ్జు: పెళ్లి కోడుకు !

Posted By:
Subscribe to Oneindia Telugu

శివమొగ్గ/బెంగళూరు: స్నేహితుడి పెళ్లికి బయలుదేరిన ఏడుగురు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా ఆయనూరు ప్రాంతంలో జరిగింది. స్నేహితుడి పెళ్లి కొన్ని గంటల్లో జరుతున్న సమయంలో వరుడి స్నేహితులు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు.

గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన శ్రీధర్, మాగడికి చెందిన సోదరులు ప్రవీణ్, మధు, శివమొగ్గ జిల్లా సోరబకు చెందిన రాజశేఖర్, శికారీపురకు చెందిన రాఘవేంద్ర, చోరడికి చెందిన మంజునాథ్, మండ్యకు చెందిన మల్లేష్ అనే ఏడుగురు దుర్మరణం చెందారు.

7 dies on the spot in car accident at Tyavarekoppa, Shivamogga.

శివమొగ్గ జిల్లాలోని కిరాతికోప్పకు చెందిన వెంకటేష్ అనే యువకుడి వివాహం పెద్దలు నిశ్చయించారు. గురువారం ఉదయం సాగర పట్టణంలో జరగనున్న వెంకటేష్ వివాహా ముహూర్తానికి హాజరుకావడానికి ఈ ఏడు మంది ఇన్నోవా కారులో బయలుదేరారు. బుధవారం రాత్రి శివమొగ్గలో భోజనం చేశారు.

గురువారం వేకువ జామున ఇన్నోవా కారులో సాగరలో జరుగుతున్న పెళ్లికి బయలుదేరారు. మార్గం మధ్యలో సాగర రహదారిలోని ఆయనూరు ప్రాంతంలో పెద్దపెద్ద కోయ్యలు తీసుకు వెలుతున్న లారీని వేగంగా వెలుతున్న ఇన్నోవా కారు ఢీకొనింది.

ఈ ప్రమాదంలో లారీలోని కోయ్యలు కారు మీదపడటంతో ఏడుగురు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. ఏడుగురి మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి. క్రేన్ ల సహాయంతో కోయ్యలు తొలగించి మృతదేహాలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. స్నేహితులు ఏడుగురు మరణించడంతో తాను పెళ్లి చేసుకోనని వరుడు వెంకటేష్ మొండికి వెయ్యడంతో పెద్దలు నచ్చచెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The accident happened when a truck carrying wooden logs was hit by the speeding car. The wooden logs fell on the Innova car killing all the seven passengers on the spot.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి