లేబర్ మార్కెట్ జోష్, కానీ: 2011-15 మధ్య పెరిగింది 7మిలియన్ ఉద్యోగాలే

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారతదేశంలో గత కొంత కాలంగా లేబర్ మార్కెట్ భారీగా పెరిగిపోతోంది. అసంఘటిత రంగంలో 2010-11, 2014-15 మధ్య కాలంలో ఏకంగా 33మిలియన్ ఉద్యోగాలు సృష్టించబడటమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ మేరకు మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ తాజాగా తన నివేదికలో వెల్లడించింది.

దీన్ని బట్టి చూస్తే ప్రతీ సంవత్సరం సగటున 8మిలియన్ల ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి. అయితే, ఇదే కాలంలో సంఘటిత(వ్యసాయం, ఇతర రంగాలు) రంగంలో 26మిలియన్ల ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. రెండు రంగాల్లో కలిపి ఈ నాలుగేళ్లలో 7మిలియన్ల ఉద్యోగాల మాత్రమే పెరుగుదల నమోదైంది. మొత్తంగా చూసుకుంటే 456మిలియన్ల నుంచి 463మిలియన్లకు ఉద్యోగాలు పెరిగాయి.

7 mn jobs added between FY11 and FY15, says McKinsey report

కాగా, అసంఘటిత రంగంలో ప్రతీ సంవత్సరం పెరుగుదల నమోదు కావడం గమనార్హం. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ఆధారంగా ఉద్యోగా, నిరుద్యోగ అంశాలపై మెకిన్సే తన రిపోర్టును తయారు చేసింది. 2011-12లో ఆర్థికాభివృద్ధి మాత్రం క్రమంగా క్షీణించడంతో 11మిలియన్ల ఉద్యోగాలు మాత్రమే సృష్టించబడ్డాయి.

కాగా, వచ్చే రెండేళ్లలో 22మిలియన్ల ఉద్యోగాలు కల్పించబడే అవకాశాలున్నాయి. వ్యాపార, సేవా, నిర్మాణం, రవాణా రంగాల్లో ఈ పెరుగుదల నమోదు కానుంది. అదే సమయంలో మైనింగ్స్, తయారీ రంగంలో కొంత తక్కువ పెరుగుదల నమోదు కానుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The labour market in India is undergoing a structural transformation. A staggering 33 million jobs were created in the non-farm sector between 2010-11 and 2014-15 finds a new study by McKinsey Global Institute. This implies that roughly eight million jobs were created on average each year.
Please Wait while comments are loading...