Omicron కలకలం: మహారాష్ట్రలో కొత్తగా ఏడు కేసులు నమోదు, దేశంలో మొత్తం 12కి చేరిక
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలకు గురిచేస్తున్న దక్షిణాప్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ కరోనా వైరస్ వేరియంట్.. ఇప్పుడు మనదేశంలోనూ కలకలం సృష్టిస్తోంది. గత రెండు మూడు రోజులుగా రోజుకు రెండు మూడు కేసులు నమోదవుతుండటం గమనార్హం. తాజాగా, దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య పది దాటడం గమనార్హం.
మహారాష్ట్రలో కొత్తగా మరో ఏడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 12కి చేరింది. గతంలో కర్ణాటకలో రెండు, గుజరాత్ రాష్ట్రంలో ఒకటి, ఢిల్లీ ఒకటి, ముంబైలో ఒకటి చొప్పున కేసులు నమోదైన విషయం తెలిసిందే.

తాజాగా, మహారాష్ట్రలో మరో 7 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో దేశంలో మొత్తం కేసుల 12కి చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 8కి చేరాయి. నైజీరియా నుంచి వచ్చిన మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ కు చెందిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆ మహిళ సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెల్లో ఈ వేరియంట్ ను గుర్తించారు. ఫ్లిన్లాండ్ నుంచి పుణె వచ్చిన మరో వ్యక్తిలోనూ ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు.
దేశంలో థర్డ్ వేవ్ మొదలవువుతోందా?
భారతదేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చే ఏడాది జనవరి - ఫిబ్రవరి నెలల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్రా అగర్వాల్ పేర్కొన్నారు.
వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పీక్స్ లో ఉండనుందని ఆయన అంచనా వేశారు మనీంద్రా అగర్వాల్. అదే సమయంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం గమనార్హం.
అయితే, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ గురించి భయాందోళనపడాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలని అన్నారు. దక్షిణాఫ్రికా రీసెర్చ్ స్టడీ ప్రకారం.. మనీంద్రా అగర్వాల్ ఏం చెప్పారంటే.. కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ సహజంగా ఉన్న ఇమ్యూనిటీని దాటడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా కొత్త వేరియంట్ కేవలం తేలికపాటి ఇన్ఫెక్షన్ మాత్రమే క్రియేట్ చేస్తుందని అన్నారు. వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ లక్షణాలు మాత్రం తక్కువగానే ఉంటాయని పేర్కొన్నారు.
Recommended Video
కాగా, థర్డ్ వేవ్ సమయంలోనూ లాక్ డౌన్ తప్పదని మనీంద్రా అగర్వాల్ అభిప్రాయడ్డారు. ప్రభుత్వం చూపించే పనితీరును బట్టి దీని ప్రభావం కనిపిస్తుందని, నైట్ కర్ఫ్యూ, నిబంధనలు, గుంపులుగా చేరకుండా చూసుకోవడం వంటి చర్యలు తీసుకోవడం వల్ల వైరస్ తీవ్రత తారాస్థాయికి చేరుకుండా అడ్డుకోవచ్చని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications