వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊపిరాడక ఏడుగురి మృతి : పరారీలో యాజమాని

|
Google Oneindia TeluguNews

వడోదర : గుజరాత్‌లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు ఏడుగురు చనిపోయారు. వడోదరలోని దర్శన్ హోటల్‌లోని సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేసేందుకు సిబ్బంది దిగారు. అయితే అందులోనుంచి విషవాయువు రావడం .. వాటిని పీల్చుకోవడంతో మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు స్థానిక పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇదీ విషయం ..
వడోదరలోని ఫర్వీకు గ్రామంలో దర్శన్ హోటల్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఇవాళ తెల్లవారుజామున హోటల్‌లోని సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేయడానికి పూనుకున్నారు. అయితే శుభ్రం చేస్తుండగా విషవాయువు పీల్చుకొని .. అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వీరిలో ముగ్గురు హోటల్ సిబ్బంది, నలుగురు పారిశుద్ద్య కార్మికులు ఉన్నారు. వారందరినీ బయటకు తీశామని .. ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయిందని పోలీసులు తెలిపారు. హోటల్ సిబ్బంది సమాచారంతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ట్యాంకులో ఉన్నవారిని బయటకు తీయగలిగారు .. కానీ ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు.

7 suffocated to death while cleaning hotel sewer in Gujarats Vadodara

ఆర్థికసాయం
ట్యాంకులో పడి చనిపోయాక వారి మృతదేహలకు పోస్టుమార్టం నిర్వహించాక బంధువులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. హోటల్‌లో ప్రమాదం జరిగాక .. యాజమాని హసన్ అబ్బాస్ ఇస్మాయిల్ బొరనియా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు పారిశుద్య కార్మికులు తువావీ గ్రామానికి చెందిన వారని ... వారిని కొందరు అద్దెకు తీసుకొని పనిచేయుస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే శైలేష్ పేర్కొన్నారు. ఈ ఘటన కార్మికులు పనిచేసేప్పుడు భద్రత ేలదని స్పష్టమవుతుందని పేర్కొన్నారు. చనిపోయిన ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షలు అందజేస్తామని గుజరాత్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

English summary
Seven persons, including four sanitation workers, died on Saturday after inhaling toxic fumes while cleaning sewer of a hotel in Vadodara district of Gujarat, officials said. The incident happened shortly after midnight at Darshan Hotel in Fartikui village of Dabhoi tehsil, around 30 kms from Vadodara city, police said. Three employees of the hotel were also among those killed. "The sanitation workers had been roped in to clean the sewer. When one worker failed to come out of the manhole, others went inside to check, but all of them died of asphyxiation," in-charge district collector Kiran Zaveri told PTI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X