స్కూల్‌లో కీచకపర్వం, ఏడేళ్ల విద్యార్థినిపై.. టాయిలెట్‌లో క్రయాన్ పెన్సిల్‌తో.. ఆపై లైంగికదాడి

పాఠశాల.. మరో దేవాలయం. ఇక్కడే విద్యార్థులు విద్యాబుద్దులు నేర్చుకొని ఉన్నతస్థితికి చేరుకుంటారు. మంచి పేరు తెచ్చుకొని పేరెంట్స్, టీచర్స్ సహా దేశ ప్రతిష్టను పెంచుతారు. కొన్ని స్కూళ్లు వేలకు వేలు ఫీజు వసూల్ చేస్తున్నాయి. కానీ విద్యార్థుల భద్రతను మాత్రం గాలికొదిలేశాయి. దీంతో స్కూల్ ఆవరణలో విద్యార్థులపై జరుగుతున్న దాడులు వెలుగులోకి వస్తున్నాయి. ఏదైనా ఒక ఘటన జరిగితే కేసు పెట్టడం, ఆందోళన చేయడంతోనే పూర్తవుతుంది తప్పా.. శాశ్వత పరిష్కారం లేకుండా పోయింది. దీంతో కొందరు యథేచ్చగా రెచ్చిపోతున్నారు.

 స్కూల్‌లో కీచకచర్య

స్కూల్‌లో కీచకచర్య

ముంబైలోని మల్వానీ పోలీసు స్టేషన్ పరిధిలో గల పాఠశాలలో గురువారం దారుణం జరిగింది. ఏడేళ్ల విద్యార్థినిపై పాఠశాల సిబ్బంది ఒకరు నీచంగా ప్రవర్తించారు. క్రయాన్ పెన్సిల్‌తో సున్నిత ప్రాంతాల్లో దాడి చేశాడు. తర్వాత లైంగికదాడి చేసినట్టు తెలుస్తోంది. చిన్నారి ఇంటికొచ్చి అమ్మ, నానమ్మకు విషయం చెబితే పేరెంట్స్ పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్, మేనేజ్‌మెంట్‌తో మాట్లాడాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

టాయిలెట్‌లో ఘటన

టాయిలెట్‌లో ఘటన

పాఠశాల రెండో అంతస్తులో ఉన్న టాయిలెట్‌లో విద్యార్థినిని దుండగులు హింసించారని తెలుస్తోంది. విద్యార్థిని తన స్నేహితురాలితో కలిసి వాష్ రూమ్‌కి వెళ్లిన ఫుటేజీని పోలీసులు చూశారు. మధ్యాహ్నాం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫుటేజీ చూశారు. కానీ అందులో ఎవరూ అనుమానంగా ప్రవర్తించలేదు. కానీ స్కూల్‌లో పనిచేసే వారంతా పురుషులే కావడంతో.. ఎవరో ఒకరు దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

వైద్యుల నిర్ధారణ

వైద్యుల నిర్ధారణ

సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత విషయాన్ని తన తల్లితో విద్యార్థిని చెప్పింది. వెంటనే వారు పరీక్షించి వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. లైంగికదాడి చేశారని.. క్రయాన్ పెన్సిల్ ఉపయోగించారని వైద్యులు చెప్పడంతో వారు స్కూల్ వద్ద నిరసనకు దిగారు. కేసు నమోదు చేసి.. ఐపీసీ 376, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఏం జరిగిందో పోలీసులకు చెప్పే సమయంలో బాలిక భయపడుతుంది.. కేసు విచారించి నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు.

పేరెంట్స్ ఆందోళన

పేరెంట్స్ ఆందోళన

విషయం తెలిసిన తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు విచారిస్తున్నామని, నిందితులను పట్టుకొని, కఠినశిక్ష పడేలా చూస్తామని డీసీపీ డీఎస్ స్వామి పేర్కొన్నారు. అయినప్పటికీ పేరెంట్స్ వినిపించుకోలేదు. ఆందోళన చేశారు. కేసు విచారణ పూర్తయ్యాక పాఠశాల యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+