దేశవ్యాప్తంగా ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు; తొలిసారి ప్రధాన ఆకర్షణగా..
దేశవ్యాప్తంగా ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసారి ప్రధాన ఆకర్షణగా స్వదేశీ ఆయుధాల ప్రదర్శన నిలవనుంది.
74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా భారతదేశం నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగ అమలులోకి వచ్చిన 1950 జనవరి 26వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం.
దేశ రాజధాని ఢిల్లీలో భారత త్రివిధ దళాల కవాతుతో గణతంత్ర వేడుకలను సగర్వంగా నిర్వహించుకుంటున్నాం. నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్ పథ్, ఇండియా గేట్ మీదగా ఎర్రకోట వరకు కవాతు కొనసాగుతుంది. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సంయుక్తంగా భారీ కవాతును నిర్వహించి భారతదేశ సమగ్రతను చాటుతారు.

ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రధాన ఆకర్షణ ఇదే
ఇక ఈసారి భారత గణతంత్ర వేడుకలలో సైనిక విన్యాసాలలో ఆయుధ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలువబోతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే సైనిక విన్యాసాలను చూడడం కోసం దేశం నలుమూలల నుంచి ప్రజలు ఢిల్లీకి వస్తారు. అయితే ఈ రోజు ప్రదర్శన చేయనున్న ఆయుధాలు భారతదేశ సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటనున్నాయి.
చైనా పాకిస్తాన్ దేశాలతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ ఈసారి సైనిక పెరేడ్లో నిర్వహించే ఆయుధాల ప్రదర్శన ప్రత్యేకతను సంతరించుకుంది.

ఢిల్లీలో గణతంత్ర వేడుకల ఏర్పాట్లు ఇలా
74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఢిల్లీ పోలీసుల ప్రకారం, జనవరి 26న జరిగే పరేడ్‌కు దాదాపు 65,000 మంది ప్రజలు వస్తారని అంచనా వేశారు. జనవరి 26న జరిగే పరేడ్‌లో ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జితో సహా దాదాపు 6,000 మంది జవాన్లను భద్రత కోసం మోహరించారు. దాదాపు 150 సీసీటీవీ కెమెరాల సహాయంతో కర్తవ్య పథాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈసారి నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ విశేషాలను చూస్తే..

ఈసారి రిపబ్లిక్ డే పెరేడ్ ... ఇలా సాగుతుంది
ఈ సంవత్సరం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే రిపబ్లిక్ డే పరేడ్, భారతదేశంలో పెరుగుతున్న స్వదేశీ సామర్ధ్యాలకు, మహిళా శక్తికి , 'న్యూ ఇండియా' ఆవిర్భావాన్ని తెలియజేస్తూ, దేశం యొక్క సైనిక పరాక్రమం తో పాటు సాంస్కృతిక వైవిధ్యం యొక్క అద్వితీయ మిశ్రమంగా ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన అమరవీరుల సందర్శించడంతో పెరేడ్ వేడుక ప్రారంభమవుతుంది.
ప్రధాని నరేంద్ర మోడీ దేశం కోసం అమరులైన వారి స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులర్పించడంతో పెరేడ్ ను ప్రారంభిస్తారు. ఈసారి రిపబ్లిక్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్-సిసితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ద్రౌపది ముర్ము వేడుకలలో పాల్గొంటున్నారు.

గణతంత్ర దినోత్సవ సందేశాన్ని ఇచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నిన్న రాత్రి 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బాన్ని రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అనేక దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది భారత దేశ అద్భుతమైన ప్రయాణం అని, ఆమె భారత ప్రజలకు, విదేశాల్లో ఉన్న భారతీయులకు తన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం భారతదేశాన్ని నూతన గౌరవంతో చూడటం ప్రారంభించిందని, ఇది మనపై కొత్త అవకాశాలు, బాధ్యతలను సృష్టించిందని ద్రౌపది ముర్ము అన్నారు.

ప్రపంచ వేదికపై కవాతు చేస్తున్న ఆత్మవిశ్వాస దేశం స్థాయికి భారత్ రూపాంతరం
ప్రపంచ వేదికపై భారతదేశానికి పెరుగుతున్న ఆదరణ గురించి, ముర్ము మాట్లాడుతూ, వివిధ ప్రపంచ వేదికలలో భారతదేశ జోక్యం సానుకూల మార్పును ప్రారంభించిందన్నారు. మెరుగైన ప్రపంచాన్ని మంచి భవిష్యత్తును రూపొందించడానికి, ప్రజాస్వామ్యం, బహుళపక్ష భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం G-20 దేశాల అధ్యక్షత, ఒక అవకాశం అని ఆమె అన్నారు.
మరింత సమాన అవకాశాలు కల స్థిరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి G-20 తన ప్రయత్నాలను మరింత మెరుగుపరచగలదని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పుడు భారతదేశం పేద, నిరక్షరాస్యులైన దేశం స్ధాయి నుండి ప్రపంచ వేదికపై కవాతు చేస్తున్న ఆత్మవిశ్వాస దేశం స్థాయికి రూపాంతరం చెందిందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications