వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో 34 లక్షలకు పైగా కరోనా కేసులు.. ఒకేరోజులో 76,472 కొత్త కేసులు, 1,021 మరణాలు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉంది .తాజాగా 30 లక్షలకు కేసులు చేరుకున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో నమోదవుతున్న తీరుతో పాటు ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేస్తున్న వైద్య సిబ్బందిలోనూ కరోనా కేసులు పెరగటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది.

Recommended Video

COVID-19 : India Crosses 34 Lakh Mark సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు : జార్ఖండ్ || Oneindia
ఇండియాలో గత 24 గంటల్లో 76,472 కొత్త కేసులు, 1,021 మరణాలు

ఇండియాలో గత 24 గంటల్లో 76,472 కొత్త కేసులు, 1,021 మరణాలు

గత 24 గంటల్లో భారత్ లో 76,472 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,021 కరోనా మరణాలు నమోదు అయ్యాయి . కొత్త కేసుల పెరుగుదలతో భారతదేశ కరోనావైరస్ సంఖ్య 34 లక్షలకు పైగా చేరుకుంది. దీంతో దేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 34,63,973 గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం తెలిపింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 62,550 కు చేరుకుంది. ప్రస్తుతం, భారతదేశంలో 7,52,424 యాక్టివ్ కేసులు ఉండగా, 26,48,999 మందికి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు.

కేసుల పెరుగుదలతో పూర్తిగా అన్ లాక్ ప్రక్రియపై వివిధ రాష్ట్రాల సంశయం

కేసుల పెరుగుదలతో పూర్తిగా అన్ లాక్ ప్రక్రియపై వివిధ రాష్ట్రాల సంశయం

రికవరీ రేటు గత 76.49 శాతానికి పెరిగింది. భారతదేశంలో మరణాల రేటు 1.82 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నందున, కొన్ని రాష్ట్రాలు జిమ్‌లను, స్కూల్స్ ను, షాపింగ్ మాల్స్ ను తిరిగి తెరవడానికి సంశయంలో ఉన్నాయి. కొనసాగుతున్న కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి మధ్య ఈ సంవత్సరం నీట్ మరియు జెఇఇ పరీక్షలను నిర్వహించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది, విద్యార్థుల భద్రతపై ప్రతిపక్ష నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

లాక్ డౌన్ పొడిగించిన జార్ఖండ్ సర్కార్

లాక్ డౌన్ పొడిగించిన జార్ఖండ్ సర్కార్


ఇక కరోనా వైరస్ కేసులు ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్న నేపధ్యంలో లాక్ డౌన్ పొడిగించాలని జార్ఖండ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. ప్రజలంతా లాక్‌డౌన్‌ నియమాలను పాటించాలని, మాస్కులు ధరించాలని హేమంత్ సోరెన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు జార్ఖండ్ లో ఇప్పటివరకు 34 వేలకు పైగా కేసులు నమోదవగా... 378 మంది కరోనా కు బలి అయ్యారు.

ఇండియాలో టాప్ త్రీ రాష్ట్రాల్లో కేసుల పరిస్థితి ఇదే !!

ఇండియాలో టాప్ త్రీ రాష్ట్రాల్లో కేసుల పరిస్థితి ఇదే !!


ఇక కరోనా కేసులలో టాప్ గా ఉన్న మహారాష్ట్రలో బీభత్సంగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు మహారాష్ట్ర లో మొత్తం 7,47,995 కరోనా కేసులు నమోదవగా ,1,80,718 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా నుండి కోలుకున్న వారు 5,43,170 కాగా 23,775 మంది కరోనాతో మృతి చెందారు . తమిళనాడు రెండో స్థానంలో, ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి . తమిళ నాడులో ఇప్పటివరకు 4,09,238 కరోనా కేసులు నమోదు కాగా , 52,506 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి .3,49,682 మంది డిశ్చార్జ్ అయ్యారు. 7,050 మంది మృతి చెందారు . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 4,03,616 మొత్తం కేసులు ఉన్నాయి.
96,191 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 3,03,711 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 3,714 మంది మృతి చెందారు .

English summary
India's coronavirus tally crosses to 34 lakh-mark with a spike of 76,472 new cases. The death toll in India rose by 1,021 to 62,550. With over 34 lakh coronavirus cases, the total number of active cases now stand at 7,52,424. CoviD-19 case tally in the country stands at 34,63,973 including 7,52,424 active cases, 26,48,999 cured/discharged/migrated & 62,550 deaths,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X