Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆరంచెల భద్రత- 70 వేలమంది పోలీసులు మోహరింపు

దేశ 76వ గణతంత్ర దినోత్సవానికి ఢిల్లీ ముస్తాబైంది. కర్తవ్యపథ్‌లో కోలాహలం నెలకొంది. రాష్ట్రపతి ముర్ము జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు.స్వర్ణిమ్ భారత్- విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్‌తో ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబావో సుబియాంతో హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయన భారత్‌కు చేరుకున్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో 70 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు, 70,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు ఏర్పాటు పూర్తి చేశారు. వాహనాల తనిఖీ ముమ్మరంగా కొనసాగుతోంది.

76th Republic day High alert in Delhi as 70000 Police personnel are deployed

ఒక్క న్యూఢిల్లీ జిల్లాలోనే 15,000 మంది భద్రతా సిబ్బందితో కూడిన ఆరు లేయర్‌ల భద్రతను ఏర్పాటు చేశారు. డేటా బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్, వీడియో ఎనలిటిక్స్‌తో కూడిన 2,500కు పైగా సీసీటీవీ కెమెరాల అమర్చారు. కర్తవ్యపథ్ చుట్టూ నాలుగు చదరపు కిలోమీటర్ల మేర గగనతలాన్ని మూసివేశారు.

నాలుగు కిలోమీటర్ల పరిధిలో యాంటీ-డ్రోన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కవాతు జరిగే మార్గంలో ఉన్న 200 భవనాల కిటికీలను మూసివేశారు. ఆయా భవనాలపై స్నిపర్లను మోహరింపజేశారు.

76th Republic day High alert in Delhi as 70000 Police personnel are deployed

కమాండోలు, క్విక్ రియాక్షన్ టీమ్స్, పీసీఆర్ వ్యాన్లు, యాంటీ- సాబొటేజ్ చెక్- స్వాత్ బృందాలతో సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అనన్ని జోన్ల డిప్యూటీ పోలీస్ కమిషనర్ల స్థాయిలో ఈ భద్రత ఏర్పాటైంది. ఈస్ట్ జోన్ డీసీపీ సారథ్యంలో అన్ని జోన్ల పోలీసు ఉన్నతాధికారులతో స్పెషల్ టీమ్ ఏర్పాటైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+