యూపీలో రైలు ప్రమాదం: పట్టాలు తప్పిన మహాకోశల్ ఎక్స్‌ప్రెస్ రైలు

Posted By:
Subscribe to Oneindia Telugu

కాన్పూర్: ఉత్తర ప్రదేశ్‌లో రైలు ప్రమాదం సంభవించింది. జబల్‌పూర్ (మధ్యప్రదేశ్) నుంచి హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) మధ్య నడిచే మహాకోషల్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది.

ఉత్తరప్రదేశ్‌లోని కుల్‌పహాడ్‌ వద్ద ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

mahakoshal express

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల పలు రైలు ప్రమాదాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Eight coaches of Mahakoshal Express have derailed near Kulpahar in Uttar Pradesh. The accident site is 270 kilometres away from the Lucknow the capital of Uttar Pradesh. Four air conditioned and four general compartments were among the eight coaches that have derailed.
Please Wait while comments are loading...