ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాు, 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో ఏడు నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే కేంద్రీయ విద్యాలయాలతో దేశ వ్యాప్తంగా 82 వేల మందికిపైగా విద్యార్థులకు ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించనున్నాయి.

ఏపీలోని ఈ ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాలు
చిత్తూరులోని వలసపల్లె, సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె, రొంపిచర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ నూజీవీడు, నంద్యాల జిల్లాలోని డోన్‌లో, అనకాపల్లిలోనూ కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది.
తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు ఈ ప్రాంతాల్లోనే..
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరోవైపు, ఢిల్లీ-హర్యానా మధ్య కనెక్టివిటీని మెరుపర్చేందుకు రూ. 6,230 కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ కారిడార్ ను నాలుగేళ్లలో పూర్తి చేయనుంది. ఢిల్లీ మెట్రో నాలుగో దశ ప్రాజెక్టు కింద 26.463 కిలోమీటర్ల మేర రిథాలా-కుండలి కారిడార్ ను అభివృద్ధి చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications