నదిలో పడ్డ బస్సు 8 మంది మృతి.. 4గురు గల్లంతు
కాట్మండు : నేపాల్ రాజధాని కాఠ్మండులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డోల్ఖాలోని దౌరాలి నుండి రాజధాని కాఠ్మండు వెలుతున్న బస్సు నదిలో పడింది. కాగా ఈ సంఘటనలో ఎనిమది మంది మృతి చెందగా.. 12 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. నదిలో పడ్డ మరో నలుగురు గల్లంతయినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన స్థలం వద్ద సహాయక చర్యలు జరుగుతున్నాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బస్సులో మొత్తం 34 మంది ఉన్నట్టు సమాచారం.













Click it and Unblock the Notifications