కారు, టూ వీలర్లపై విరిగిపడ్డ కొండచరియలు.. 8 మంది మృతి, పలువురికి గాయాలు
ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ్ జిల్లా చాండీ కా దార్‌లో రహదారిపై పడ్డాయి. దీంతో అటు నుంచి వస్తోన్న మూడు వాహనాదారులపై పడిపోయింది. వీటిలో ఓ కారు, రెండు ద్వి చక్ర వాహనాలు ఉన్నాయి. కొండచరియలు విరిగిపడటంతో 8 మంది చనిపోయినట్టు అధికారులు పేర్కొన్నారు. పలువురు గాయపడ్డారు.
శనివారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డట్టు అధికారులు పేర్కొన్నారు. రాత్రి ముగ్గురు చనిపోయినట్టు అధికారులు గుర్తించారు. క్షతగాత్రుల్లో మరో ఐదుగురు చనిపోయారని ఆదివారం ఉదయం అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని వెంటనే సమీపంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో అక్కడ మట్టిపెళ్లలతో నిండిపోయింది. గాయపడ్డ వారి నెత్తుటితో అక్కడ భీతావాహ పరిస్థితి నెలకొంది.

కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తోండగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. అయితే వాహనాల్లో ఎంత మంది ఉన్నారనే అంశంపై క్లారిటీ లేదని జిల్లా కలెక్టర్ మంగేశ్ గిల్దియాల్ పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్ పేరుతో ఉందని తెలిపారు. మృతులంతా ఢిల్లీకి చెందిన వారు అని చెప్పారు. ఈ ఘటనపై మేజిస్ట్రేట్‌తో విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. మృతులను గుర్తించి.. బంధువులకు అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications