మహారాష్ట్రలో 8 మంది ఆంధ్రుల మృతి (ఫోటోలు)

ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్ రాష్టానికి చెందిన కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడి వాసులు.

గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సులో కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్టణానికి చెందిన 40 మంది తీర్థయాత్రలకు వెళ్లారు. సెప్టెంబర్ 29న షిర్డీతోపాటు, యాత్రలను ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో పండరీపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది.

వంతెనపై నుంచి ఉజిని డ్యామ్ బ్యాక్ వాటర్ కాలువలోకి వీరి బస్సు పడింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికి అక్కడే మృతి చెందారు. బస్సులో మొత్తం 51 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం.

 మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదంలో 8 మంది కృష్ణా జిల్లా వాసుల మృతి

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదంలో 8 మంది కృష్ణా జిల్లా వాసుల మృతి


మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి (ఫోటోలు)

మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి (ఫోటోలు)

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదంలో 8 మంది కృష్ణా జిల్లా వాసుల మృతి
రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతదేహాలను, బాధితులను తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

 మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదంలో 8 మంది కృష్ణా జిల్లా వాసుల మృతి

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదంలో 8 మంది కృష్ణా జిల్లా వాసుల మృతి


షోలాపూర్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో బాధితులను, మృతదేహాలను తరలించనున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి అయ్యే వైద్య ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదంలో 8 మంది కృష్ణా జిల్లా వాసుల మృతి

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదంలో 8 మంది కృష్ణా జిల్లా వాసుల మృతి

సంఘటనా స్దలం నుంచి మృతదేహాలను ప్రత్యేక విమానం ద్వారా తరలించేందుకు నిబంధనల వల్ల వీలుకాకపోతే రోడ్డు మార్గం ద్వారా ఈ రాత్రికే హైదరాబాద్‌కు తరలిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

దీంతో బస్సులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. చలమల శెట్టి పాండురంగ(60), జగన్మోహన్ రావు (55), లక్ష్మీ (45), ఎన్. లక్ష్మీ కుమారి (50), శేషమణి (45), వెంకటేశ్ (45), రేష్మ (20), లక్ష్మీ (55). మృతుల భౌతికకాయాలకు కర్మాలా ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహించారు.

రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రులు చినరాజప్ప, కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లిన వారి వివరాలు సేకరిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాదంలో మృతదేహాలను, బాధితులను తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. షోలాపూర్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో బాధితులను, మృతదేహాలను తరలించనున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి అయ్యే వైద్య ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సంఘటనా స్దలం నుంచి మృతదేహాలను ప్రత్యేక విమానం ద్వారా తరలించేందుకు నిబంధనల వల్ల వీలుకాకపోతే రోడ్డు మార్గం ద్వారా ఈ రాత్రికే హైదరాబాద్‌కు తరలిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+