Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూనిఫాం సివిల్ కోడ్, 8 లక్షల ఉద్యోగాలు: బీజేపీ హిమాచల్ మేనిఫెస్టో కీలకాంశాలు

షిమ్లా: నవంబర్ 12న హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేసింది.యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు, 8 లక్షల ఉద్యోగాల కల్పన అనేవి బీజేపీ మేనిఫెస్టోలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

యువతకు ఉద్యోగ అవకాశాలు అనే 11 "కమిట్‌మెంట్స్" పెట్టుకుంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎన్నికల వాగ్దానాలను ప్రకటిస్తూ - మహిళా సాధికారత పార్టీకి కీలకమైన దృష్టి అని అన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు. ఆరోగ్య, విద్య మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నొక్కి చెప్పారు.

8 lakh jobs, Uniform Civil Code: BJPs 11 commitments ahead of Himachal Pradesh polls

27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ ప్రభుత్వం - అమలును సమీక్షించడానికి ఒక ప్యానెల్‌ను ప్రకటించిన తర్వాత.. హిమాచల్‌లో యూసీసీ అమలు హామీని ప్రకటించారు. గుజరాత్‌లో వచ్చే నెలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడతాయి.

ఇదిలా ఉండగా, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఇవి:

1) "హిమ్ స్టార్టప్" పథకంలో భాగంగా, రూ. 900 కోట్ల నిధి ఏర్పాటు చేయబడుతుందని బీజేపీ హామీ ఇచ్చింది.

2) నిరుద్యోగంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల మధ్య 8 లక్షల ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

3) "సంకల్ప్ పత్ర" ప్రకారం.. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే హిమాచల్‌లో ఐదు కొత్త మెడికల్ కాలేజీలు వస్తాయి. "ప్రాథమిక ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొబైల్ క్లినిక్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తామని, తద్వారా దూర ప్రాంతాల ప్రజలు ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు అని జెపి నడ్డా చెప్పారు.

4) రూ . 5,000 కోట్ల పెట్టుబడితో అన్ని గ్రామాలకు రహదారులు కలుపుతాయి .

5) 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికలకు పాఠశాలలకు వెళ్లేందుకు సైకిల్ ఇవ్వబడుతుంది. ప్రతి జిల్లాలో రెండు బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేస్తామన్నారు.

6) 'శక్తి' కార్యక్రమం కింద, మతపరమైన ప్రదేశాలు, దేవాలయాల చుట్టూ మౌలిక సదుపాయాలు, రవాణాను అభివృద్ధి చేయడానికి 10 సంవత్సరాల వ్యవధిలో ₹ 12,000 కోట్లు ఖర్చు చేస్తారు.
"అవి 'హిమ్‌తీర్త్' సర్క్యూట్‌కి కనెక్ట్ చేయబడతాయి" అని నడ్డా చెప్పారు.

7) PM-కిసాన్ నిధి యోజన కింద సంవత్సరానికి ₹ 3,000 అదనపు మొత్తం ఇవ్వబడుతుంది. 10 లక్షల మంది రైతులు ఈ కార్యక్రమానికి చేర్చబడతారు.

8) వక్ఫ్ ఆస్తులపై న్యాయ కమిషన్ చట్టం ప్రకారం దర్యాప్తు చేయబడుతుంది. వాటి అక్రమ వినియోగాలు నిలిపివేయబడతాయి అని జేపీ నడ్డా చెప్పారు.

9) ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పంపిణీలో వ్యత్యాసాలు తొలగించబడతాయి.

10) విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు పరిహారం పెరుగుతుంది.

11) యాపిల్ పండించేవారికి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 12 శాతానికి పరిమితం చేయబడుతుంది.

12) ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్

13) విద్యార్థినులకు స్కూటీలు

68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నవంబర 12న ఎన్నికలు జరగనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+