కంటైనర్ ఢీ కొట్టిన వేగానికి ఎస్‌యూవీ నుజ్జునుజ్జు: ఎనిమిది అక్కడికక్కడే దుర్మరణం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్రా సమీపంలో ఈ తెల్లవారు జామున సంభవించిన ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
ఆగ్రా సమీపంలోని ఇట్మాద్దౌలా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నాగాలాండ్ నుంచి న్యూఢిల్లీ వైపు వెళ్తోన్న ఎస్‌యూవీ కారును ఇట్మాద్దౌలా ప్రాంతంలో ఎదురుగా వస్తోన్న కంటైనర్‌ను ఢీ కొట్టింది. ప్రమాద వేగానికి కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. కారును ఢీ కొట్టిన వెంటనే కంటైనర్ రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. కొన్ని మీటర్ల దూరం పాటు కారును లాక్కెళ్లిందా కంటైనర్. రోడ్డు పక్కన ఉన్ని దుకాణాలు కూడా ధ్వంసం అయ్యాయి.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న ఎనిమిది మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా కారులో ప్రయాణిస్తున్నవారే. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు ఎక్కడివారనేది ఇంకా తెలియరాలేదని తెలిపారు. మృతుల వివరాల కోసం ఆరా తీస్తోన్నారు. కారును జార్ఖండ్‌లో రిజిస్టర్ చేయించారని చెప్పారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications