షాకింగ్ : మగ పిల్లాడినే కనాలని-భార్యకు నరకం-8 అబార్షన్లు,1500 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు-భర్త,అత్తింటివారి ఘాతుకం
నిత్య నూతన ఆవిష్కరణలు,దినదినాభివృద్ది చెందుతున్న టెక్నాలజీ,అంతరిక్షంలోకి అడుగపెడుతున్న మహిళలు... ఇవన్నీ చూసి మానవ సమాజం చాలా ముందుకెళ్లిందని భావిస్తుంటాం. కానీ ఇప్పటికీ అడుగడుగునా వివక్షలు,అసమానతలు,మూఢత్వం సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. చదువుకున్నవాళ్లు సైతం వీటిని ఒంటబట్టించుకోవడం అత్యంత విచారకరం. తాజాగా ముంబైలో ఓ విద్యావంతుల కుటుంబం ఆ ఇంటి కోడలిని హింసించిన ఘటన అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. కంటే కొడుకునే కనాలని అత్తింటివారు ఆమెకు నరకం చూపించారు. ఎనిమిదిసార్లు ఆమెకు అబార్షన్ చేయించారు... ఏకంగా 1500 స్టెరాయిడ్స్ ఇచ్చారు. ఇక ఆ నరకాన్ని తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగింది...
ముంబైకి చెందిన ఓ మహిళ(40)కు 2007లో.. అదే నగరంలోని దాదర్ ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. ఆమె అత్త,భర్త ఇద్దరూ న్యాయవాదులు.భర్త సోదరి వైద్యురాలు.ఉన్నత కుటుంబం కావడంతో తన బిడ్డ జీవితం ఇక సాఫీగా సాగుతుందని ఆ తండ్రి భావించాడు. కానీ అంతా తలకిందులైంది. పేరుకే ఉన్నత విద్యావంతులు గానీ.. వారి ప్రవర్తనలో అది మచ్చుకైనా కానరాలేదు. 2009లో మొదటి కాన్పులో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.ఆ తర్వాత 2011లో మరోసారి గర్భం దాల్చింది. అయితే పుట్టబోయేది మగబిడ్డా,ఆడబిడ్డా తెలుసుకునేందుకు ఆమె భర్త ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి లింగ నిర్దారణ పరీక్షలు చేయించాడు.

8సార్లు అబార్షన్... 1500 ఇంజెక్షన్లు...
పుట్టబోయేది బిడ్డేనని తెలియడంతో ఆమెకు అబార్షన్ చేయించాడు. అప్పటినుంచి భర్త,అత్తింటివారు ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తమ కుటుంబానికి వారసుడు కావాలని... మగబిడ్డనే కనాలని ఆమెను వేధించడం మొదలుపెట్టారు. అది ఆమె చేతిలో లేదనే విషయం తెలిసి కూడా ఆమెను మానసికంగా,శారీరకంగా హింసించారు. ఒకటి కాదు,రెండు కాదు,ఎనిమిదిసార్లు ఆమెకు అబార్షన్ చేయించారు. ఎలాగైనా సరే మగపిల్లాడినే కనాలని... ఆమెకు రకరకాల వైద్య పరీక్షలు,చికిత్సలు,సర్జరీలు చేయించారు. బ్యాంకాక్ తీసుకెళ్లి మరీ ప్రీ కాన్సెప్షన్,ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ పరీక్షలు చేయించారు.గర్బధారణకు ముందే ఎంబ్రియో లింగాన్ని నిర్దారించే ఈ పరీక్షలపై భారత్‌లో నిషేధం ఉంది. మగపిల్లాడు పుట్టాలని ఏకంగా ఆమెకు 1500 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చారు.

ముంబై పోలీసులకు ఫిర్యాదు..
భర్త,అత్తింటివారు చూపిస్తున్న నరకాన్ని తాళలేక ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇష్టానికి వ్యతిరేకంగా,తన శరీరాన్ని అత్తింటివారు,భర్త కలిసి ఓ ప్రయోగశాలగా మార్చేశారని వాపోయింది.తన అనుమతి లేకుండానే 8 సార్లు అబార్షన్ చేయించారని... 1500 స్టెరాయిడ్స్ ఎక్కించారని పేర్కొంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నత విద్యావంతులు,సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న భర్త,అత్తింటివారు ఆమెను ఇంత చిత్రహింసలకు గురిచేయడం చాలామందిని షాక్‌కి గురిచేస్తోంది.

మగపిల్లాడి కోసం ఉన్మాదిలా....
మగపిల్లాడే పుట్టాలనే పిచ్చితో గతంలో ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి ఉన్మాదిలా ప్రవర్తించాడు. పన్నాలల్ అనే ఆ వ్యక్తి భార్య ఏడు నెలల గర్భంతో ఉన్నప్పుడు.. పదునైన చాకుతో ఆమె గర్భాన్ని చీల్చాడు.ఆ బాధను తట్టుకోలేని బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. బాధితురాలి కేకలతో అప్రమత్తమైన స్థానికులు హుటాహుటిన ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.తనకు పుట్టబోయే బిడ్డ ఎవరనేది తెలుసుకునేందుకు భర్త పన్నాలల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.

చెత్తకుప్పలో పడేస్తున్న ఘటనలు...
ఆడపిల్ల పుట్టిందని తెలియగానే ముఖం చాటేసే భర్తలు... గుట్టుచప్పుడు కాకుండా నవజాత శిశువులను చెత్త కుప్పల్లో విసిరేస్తున్న ఘటనలు దేశంలో ఇప్పటికీ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గతేడాది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి 85కి.మీ దూరంలో ఉన్న మీరట్ పరిధిలోని శతాబ్దినగర్ కాలనీలో ఓ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు గోనె సంచుల్లో కుక్కి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.రోడ్డుపై వెళ్తున్న పాదాచారులకు ఎక్కడో పసికందు ఏడుపు వినిపించింది. చుట్టూ చూస్తే ఎక్కడా పసిపిల్లలు లేరు. అయితే సమీపంలో ఓ మూట కనిపించడంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో దగ్గరికెళ్లి ఆ మూటను విప్పగా... అందులో ఓ గోనె సంచి కనిపించింది. దాన్ని విప్పి చూడగా.. అందులో మరో గోనె సంచీ ఉంది. చివరకు అందులో ఓ నవజాత శిశువును గుర్తించారు. మొత్తం మూడు గోనె సంచులు.. గుర్తు తెలియని వ్యక్తులు ఆ నవజాత శిశువును అందులో కుక్కి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. ఇదే యూపీలో గతంలో ఇలాంటిదే మరో దారుణం వెలుగుచూసింది. రాయ్‌బరేలీలోని ఓ శ్మశానంలో.. ఓ మట్టికుండలో నవజాత శిశువును ఉంచి మూడు అడుగుల లోతులో ఉన్న గుంతలో పడేశారు.

ఆడపిల్ల పుట్టిందని పూల వర్షంతో స్వాగతం...
ఆడపిల్లలను గర్భంలోనే చిధిమేయడం... పురిటి వాసన కూడా పోకముందే ఆ బిడ్డలను వదిలించుకోవడం... ఓవైపు ఇలాంటి ఘటనలు కనిపిస్తుంటే... మరోవైపు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మిలా భావించే కుటుంబాలూ లేకపోలేదు. గతేడాది మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వగా... అత్త,మామలు పూల వర్షంతో ఆమెను ఇంట్లోకి స్వాగతించారు. మహాలక్ష్మి వచ్చిందన్న ఆనందంతో ఇంటి బయట నుంచి లోపలి గది వరకు వారిని పూల బాటపై నడిపించారు. చిన్నారిని పడుకోబెట్టిన బెడ్‌పై పూలను అందంగా పేర్చి సంబరపడ్డారు. అత్తింటివారు చూపించిన ప్రేమకు ఆ కోడలు మురిసిపోయింది. ఇంతటి ఘన స్వాగతాన్ని ఊహించలేదని ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయింది.కోడలిని కన్నకూతురిలా ఆదరిస్తున్న ఆ అత్తమామలపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఇలాంటి అత్తమామలు ఉంటే ప్రతి ఇంటి కోడలు ఎంతో సంతోషంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications