వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశం కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విజయవంతమైందని మెజార్టీ ప్రజలు పేర్కొన్నారు. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి ఇప్పుడు దేశ ప్రజలకు మరింత ఊరట కలిగించారని తెలిపింది.

ఇది ఇలావుంటే, మరోవైపు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దులో రహదారిపై పంజాబ్, హర్యానా రైతులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలలుగావారు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు రైతులు. కేంద్రంతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ సఫలం మాత్రం కాలేదు. కానీ రైతులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలలో, ప్రభుత్వ ఉద్దేశ్యాల గురించి అంతగా నమ్మకం లేదు.

కాగా, దేశ రాజధాని సరిహద్దులో రైతులు దాదాపు రెండు నెలలుగా చేస్తున్న ఆందోళనలను నియంత్రించడంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం సఫలమైందని 80 శాతం ప్రజలు సానుకూలంగా స్పందించారు.

 80% satisfied with govts handling of farmers protest: Mood of the Nation poll

అదే సమయంలో నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయా? కార్పొరేట్లకు లబ్ధి చేకూరుస్తాయా? అనే అంశంపైనా ప్రజలు స్పందించారు. 34 శాతం మంది వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని చెప్పారు. 32 శాతం మంది ఈ చట్టాలు కార్పొరట్లకు లబ్ధి చేకూరుస్తాయని అన్నారు. మరో 25 శాతం మంది రైతులు, కార్పొరేట్లకు కూడా ఈ చట్టాలు మేలు చేయవని అన్నారు.

ఈ నూతన వ్యవసాయ చట్టాలకు సవరణలు చేసి అమలు చేస్తామంటే 55 శాతం మంది ప్రజలు సానుకూలంగా స్పందించారు. మరో 28 శాతం మంది మాత్రం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

English summary
80% satisfied with govt's handling of farmers' protest: Mood of the Nation poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X