ఆడుకుంటుంటే తీసుకెళ్లి 8ఏళ్ల బాలికపై అత్యాచారం, చితక్కొట్టారు
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలిక పైన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన బదౌన్ జిల్లాలోని ముఝారియా జిల్లాలో చోటు చేసుకుంది. బాలిక పైన నిందితుడు శుక్రవారం అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల మైనర్ బాలిక పైన 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు. ఆ బాలిక తన ఇంటి బయట ఆడుతున్న సమయంలో విజయ్ యాదవ్ అనే వ్యక్తి ఆమెను ఎవరు లేని ప్రదేశానికి తీసుకు వెళ్లాడని చెప్పారు.
అక్కడ ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. బాలిక పైన జరిగిన దారుణ సంఘటన తెలిసిన గ్రామస్థులు అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులకు అప్పగించే ముందు అతనిని గ్రామస్థులు చితకబాదారు. పోలీసులు శనివారం అతని పైన కేసు పెట్టి, ఆదివారం అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications