వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోల ప్రతీకార దాడులు: 9మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి

|
Google Oneindia TeluguNews

సుకుమా: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు తెగబడ్డారు. ఇటీవల పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులు మందుపాతరలు పేల్చి జవాన్ల ప్రాణాలు తీశారు.

మంగళవారం సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వ్యాన్‌లో ప్రయాణిస్తుండగా గొల్లపల్లి-కిష్టరాం గ్రామాల మధ్య మందుపాతర పేల్చారు. ఆ తర్వాత కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 9 సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతిచెందగా.. మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

9 CRPF Personnel Killed In Maoist Attack In Chhattisgarh's Sukma

క్షతగాత్రులను రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Recommended Video

Encounter : Ten Maoists And A Constable Lost Life

ఇటీవల తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. తెలంగాణలోని తడపలగుట్ట, ఛత్తీస్‌గఢ్‌లోని పూజారికాంకేడు అటవీ ప్రాంతం సరిహద్దుల్లో ఈ కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్ కు చెంది ఓ కానిస్టేబుల్‌ మృతి చెందాడు.

English summary
Nine personnel of the Central Police Reserve Force have died after Maoists blew up a mine protection vehicle or MPV, in Sukma district of Chhattisgarh. Four CRPF personnel have also been injured in the attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X