కూలిన బస్టాండ్ పైకప్పు: 10మంది మృతి, పలువురికి గాయాలు
తమిళనాడులో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లాలోని సోమనూరు బస్టాండ్ పైకప్పు కూలి తొమ్మిదిమంది దుర్మరణం పాలయ్యారు. మరో పది మందికిపైగా గాయపడ్డారు.
చెన్నై: తమిళనాడులో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లాలోని సోమనూరు బస్టాండ్ పైకప్పు కూలి పదిమంది దుర్మరణం పాలయ్యారు. మరో పది మందికిపైగా గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హఠాత్తుగా బస్టాండ్ స్లాబ్ కూలడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీశారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నానిపోయిన బస్టాండ్ పైకప్పు కూలినట్లు తెలుస్తోంది. బస్టాండ్ కూడా పాతదే కావడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications