లోయలో పడిన టూరిస్ట్ బస్సు: 9 మంది మృతి, 25 మందికి గాయాలు
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి లోయలో పడడంతో తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు సహా ఓ మైనర్ ఉన్నారు. ఈ ఘటన తమిళనాడులోని కూనూర్ సమీపంలోని మరాపలం వద్ద చోటు చేసుకుంది. ఊటీ విహారయాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో టూరిస్ట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది.
ప్రమాద సమయంలో బస్సులో 59 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెంకాసి జిల్లా కడయం ప్రాంతానికి చెందిన పర్యటకులు ఊటీ విహారయాత్రకు వెళ్లారు. పర్యటన ముగించుకుని శనివారం తిరుగు ప్రయాణమయ్యారు.

శనివారం సాయంత్రం 5.15 గంటల సమయంలో బస్సు కూనూర్‌లోని మలపాలం వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు ఒక్కసారిగా లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు, ఓ మైనర్ సహా 9 మంది మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని కోయంబత్తూరు ఆస్పత్రికి తరలించారు.

బస్సు ప్రమాదం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు పర్యటక శాఖ మంత్రి కే రామచంద్రన్‌ను నియమించినట్లు తెలిపారు. మరోవైపు, ప్రమాదం గురించి సమచాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం హైల్ప్ లైన్-1077 ను ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications