తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి
కాంచీపురం: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రుల్లో చేర్పించారు.
వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వ్యాన్‌లో 16 మంది కంటే మించి ప్రయాణం చేయకూడదు. అయితే 25 మందిని వ్యాన్‌లో ప్రయాణించడం వల్ల ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగిందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

ఈ వ్యాన్‌లో ప్రయాణీస్తున్న మరో 16 మంది ప్రయాణీకులు కూడ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాంచీపురం కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications