భూకంప బీభత్సం: 9మంది మృతి(పిక్చర్స్)
మణిపూర్: తీవ్రమైన భూకంపం బారినపడి ఈశాన్యభారతం సోమవారం వణికిపోయింది. ఉదయం 4.30 గంటలకు మణిపూర్ కేంద్రంగా 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి తొమ్మిదిమంది మరణించారు. 100 మందికిపైగా గాయాలపాలయ్యారు. అనేక భవనాలు, ఇళ్లు ధ్వంసమై భారీఎత్తున ఆస్తినష్టం జరిగింది.
కాగా, మణిపూర్‌లోని టామెంగ్‌లాంగ్ జిల్లాలో భూమి ఉపరితలం నుంచి 17 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటి (ఎన్‌డిఎంఎ) అందించిన వివరాల ప్రకారం భూకంపం వల్ల ఇంఫాల్‌లో ఇప్పటి వరకు 9మంది మృతి చెందారు. 33మంది గాయపడ్డారు. టామెంగ్‌లాంగ్‌లో అనేక భవనాలు కూలిపోగా, ఇంఫాల్‌లో కొన్ని భవనాలు, మార్కెట్ కాంప్లెక్స్ కూలిపోయింది. అనేక భవనాలు పగుళ్లుతేలాయి.
భూకంపం సంభవించిన కొద్ది సేపటికే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టామెంగ్‌లాంగ్ జిల్లాలో ఒక భవనం కూలడంతో అందులో ఉన్న ఒక బాలిక మృతి చెందింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని టావోబుంగ్‌ఖోక్ గ్రామంలో మరో వ్యక్తి మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
అసోంలోని గౌహతి, ఇతర ప్రాంతాల్లో భూకంపం వల్ల 20 మంది గాయపడ్డారని అస్సాం కమిషనర్ అండ్ సెక్రెటరి (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) ప్రమోద్ కుమార్ తివారి చెప్పారు.
కనీసం 30 భవనాలు పగుళ్లు తేలాయని అధికారులు తెలిపారు. అస్సాంలో ఉన్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తాను మాట్లాడానని, భూకంపం వల్ల తలెత్తిన పరిస్థితులను సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. మణిపూర్ సిఎం ఓక్రామ్ ఇబోబి సింగ్ సహా ఈశాన్య ప్రాతంలోని ఇతర సిఎంలతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం వల్ల నెలకొన్న పరిస్థితిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చురుగ్గా సమీక్షిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. సహాయక చర్యలు చేపట్టేందుకు గౌహతి నుంచి రెండు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలను విమానంలో ఇంఫాల్‌కు తరలించారు. సహాయకచర్యలను సైన్యం, వాయుసేన, ఎన్‌డీఎంఏ, అస్సాంరైఫిల్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

భూకంప బీభత్సం
తీవ్రమైన భూకంపం బారినపడి ఈశాన్యభారతం సోమవారం వణికిపోయింది. ఉదయం 4.30 గంటలకు మణిపూర్ కేంద్రంగా 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి తొమ్మిదిమంది మరణించారు. 100 మందికిపైగా గాయాలపాలయ్యారు.

గాయపడిన వ్యక్తి
అనేక భవనాలు, ఇళ్లు ధ్వంసమై భారీఎత్తున ఆస్తినష్టం జరిగింది. సహాయకచర్యలను సైన్యం, వాయుసేన, ‘జాతీయ విపత్తు స్పందన దళం' (ఎన్‌డీఎంఏ), అస్సాంరైఫిల్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

కూలిన భవనం
కాగా, మణిపూర్‌లోని టామెంగ్‌లాంగ్ జిల్లాలో భూమి ఉపరితలం నుంచి 17 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

మీడియాతో రాజ్‌నాథ్
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటి (ఎన్‌డిఎంఎ) అందించిన వివరాల ప్రకారం భూకంపం వల్ల ఇంఫాల్‌లో ఇప్పటి వరకు 9మంది మృతి చెందారు. 33మంది గాయపడ్డారు.

రహదారిపై కొండచరియలు
టామెంగ్‌లాంగ్‌లో అనేక భవనాలు కూలిపోగా, ఇంఫాల్‌లో కొన్ని భవనాలు, మార్కెట్ కాంప్లెక్స్ కూలిపోయింది. అనేక భవనాలు పగుళ్లుతేలాయి.

కారు ధ్వంసం
భూకంపం సంభవించిన కొద్ది సేపటికే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టామెంగ్‌లాంగ్ జిల్లాలో ఒక భవనం కూలడంతో అందులో ఉన్న ఒక బాలిక మృతి చెందింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని టావోబుంగ్‌ఖోక్ గ్రామంలో మరో వ్యక్తి మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

గాయపడిన మహిళ
అసోంలోని గౌహతి, ఇతర ప్రాంతాల్లో భూకంపం వల్ల 20 మంది గాయపడ్డారని అస్సాం కమిషనర్ అండ్ సెక్రెటరి (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) ప్రమోద్ కుమార్ తివారి చెప్పారు.

బాధితులకు పరామర్శ
కనీసం 30 భవనాలు పగుళ్లు తేలాయని అధికారులు తెలిపారు. అస్సాంలో ఉన్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తాను మాట్లాడానని, భూకంపం వల్ల తలెత్తిన పరిస్థితులను సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశించారు.

సహాయక చర్యలు
మణిపూర్ సిఎం ఓక్రామ్ ఇబోబి సింగ్ సహా ఈశాన్య ప్రాతంలోని ఇతర సిఎంలతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications