మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 9మంది దుర్మరణం..
భోపాల్: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గువాలో ట్రక్కు-బస్సు ఢీకొన్న ఘటనలో 9మంది మృతి చెందగా 20మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
రోడ్డు ప్రమాదంలో భోజ్ పురి నటి దుర్మరణం:

ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లాలో కారు-బైక్ ఢీకొన్న ఘటనలో భోజ్ పురి నటి మనీషా(45) దుర్మరణం చెందారు. షూటింగ్ నిమిత్తం తన సహ నటుడితో కలిసి కారులో వెళ్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications