వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు: తొమ్మిదిమంది అరెస్ట్

|
Google Oneindia TeluguNews

 9 students arrested for anti-Modi remarks
గురువాయూర్: ప్రధాని నరేంద్ర మోడీపై అభ్యంతరకరమైన, అనుచిత పదజాలంతో వ్యాఖ్యలు ప్రచురించడంతో కేరళలోని గురువాయూర్‌లో 9మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని బెయిల్‌పై విడుదల చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కేరళలోని శ్రీకృష్ణ కాలేజీ క్యాంపస్ విద్యార్థులు నిర్వహించే మేగజైన్‌లో క్రాస్‌వర్డ్ పజిల్‌లో ప్రధాని మోడీపై అభ్యంతరకరమైన పదజాలంతో ప్రచురించారు. దీంతో మేగజైన్‌ను నిర్వహించే స్టూడెంట్ ఎడిటర్, సబ్‌ఎడిటర్లు, సంపాదకవర్గ సలహా కమిటీ సభ్యులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై ఐపిసి సెక్షన్ 153 సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయ మేనేజింగ్ కమిటీ శ్రీకృష్ణ కాలేజీ ప్రిన్సిపాల్‌ను వివరణ కోరింది. కాగా, కాలేజీ మేగజైన్‌లో ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు ప్రచురితం కావడం కేరళలో ఇది రెండోసారి. కొద్ది రోజుల క్రితం ఓ పాలిటెక్నిక్ కాలేజీ మేగజైన్‌లోనూ హిట్లర్, లాడెన్, జార్జి బుష్ తదితరుల ఫొటోలతో పాటు నరేంద్ర మోడీ చిత్రాన్ని ప్రచురించారు. ఈ ఘటనలో కాలేజీ ప్రిన్సిపాల్ సహా కొంతమంది విద్యార్థులను అరెస్టు చేసి అనంతరం విడిచిపెట్టారు.

కాలేజీపై పోలీసులు దాడులు నిర్వహించి పత్రిక కాపీలను, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు విచారణ కొనసాగుతున్న క్రమంలో తాజాగా శ్రీకృష్ణ కాలేజీ మేగజైన్‌లోనూ మోడీని కించపరుస్తూ ప్రచురించడం గమనార్హం.

English summary

 Nine students of the Sree Krishna college at Guruvayur in Kerala were today arrested in the case related to campus magazine containing unsavoury remarks against Prime Minister Narendra Modi, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X