తొ్మ్మిదేళ్ల బాలికపై నలుగురు మైనర్లు గ్యాంగ్ రేప్
బళ్లారి: కర్ణాటకలో మరో దారుణం జరిగింది. అమ్మాయిలపై దాష్టీకాలు ఆగడం లేదు. ఓ తొమ్మిదేళ్ల బాలికపై నలుగురు మైనర్లు సామూహిక అత్యాచారంచ ేశారు. కర్ణాటకలోని హోస్పేటలో ఈ దారుణం జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
తొమ్మిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు బాలురను అరెస్టు చేసినట్లు బళ్లారి పోలీసు సూపరింటిండెంట్ చేతన్ సింగ్ రాథోడ్ పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు. నిందితుల వయస్సు పది నుంచి 13 ఏళ్ల మధ్య ఉంటుందని అన్నారు. బళ్లారికి 60 కిలోమీటర్ల దూరంలో గల హోస్పేట ఎన్‌సి కాలనీలోని ఓ ఖాళీ స్థలంలో ఆ సంధటన జరిగింది.

నలుగురు పిల్లలు కూడా వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్నారు. వారిని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచారు. వారిని అబ్జర్వేషన్ సెంటర్‌కు పంపినట్లు రాథోడ్ చెప్పారు. నలుగురు నిందితులు కూడా బాధితురాలి ఇంటి పక్కనే నివాసం ఉంటారు.
చాక్లెట్లు ఇస్తామని ఆశపెట్టి బాలికను శనివారంనాడు నలుగురు బాలురు ఓ ఖాళీస్థలంలోకి తీసుకుని వెళ్లారు. అక్కడ వారు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.












Click it and Unblock the Notifications