షాక్: తన చితికి తానే నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్య
ముంబై: ఎంతో మనోవేదనకు గురై జీవితంపై విరక్తిచెందిన ఓ వృద్ధురాలు తన చితిని తానే పేర్చుకుంది. ఆ తర్వాత నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. కొల్హాపూర్ జిల్లాకి చెందిన కళవ్వ(90) అనే వృద్ధురాలు తన కుమారుడితో కలిసి ఉంటోంది. మంగళవారం రాత్రి భోజనం చేసి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. గదిలో కట్టెలతో చితిని పేర్చి దానిపై కూర్చుంది. ఒంటినిండా కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

బుధవారం ఉదయం కళవ్వ మనవరాలు ఎంత తలుపుకొట్టినా ఆమె తెరవకపోవడంతో వెంటనే ఈ విషయాన్ని తండ్రి విఠల్‌కి చెప్పింది. విఠల్ చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగలగొట్టి చూసేసరికి దహనమై తన తల్లి శరీరాన్ని చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జీవితంపై విరక్తి కలగడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications