ముంబై కల్తీ మద్యం, మృతుల సంఖ్య 98

ముంబై: ముంబై నగరంలో కల్తీ మద్యం సేవించి మృతి చెందిన వారి సంఖ్య 98కి చేరింది. కల్తీ మద్యం సేవించిన అనేక మంది ఇప్పటికి పలు ఆసుపత్రులలో మృత్యువుతో పోరాడుతున్నారు. వారిలో చాల మంది పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు.

ముంబై నగర పోలీసు అధికారి ధనంజయ్ కులకర్ణి ఆద్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. సబర్బన్ మలాద్ లోని లక్ష్మి నగర్ మురికి వాడలలో గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పలువురు మద్యం సేవించారు. మద్యం సేవించిన తరువాత అందరూ వాంతులు, విరేచనాలు చేసుకున్నారు.

వారిని ఆసుపత్రులకు తరలిస్తున్న సమయంలో మార్గం మద్యలోనే కొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆసుప్రతులలో పలువురు మరణించారు. విషయం తెలుసుకున్న ముంబై నగర కార్పొరేషన్ అధికారులు, పోలీసులు, వివిద పార్టీల నాయకులు ఆసుపత్రుల దగ్గరకు పరుగు తీశారు.

 98 people have died after they consumed spurious liquor in Mumbai

శుక్రవారం ఉదయానికి 25 మంది మరణించారు. తరువాత బాధితులను ముంబై నగరంలోని ప్రైం ఆసుపత్రి, శతాబ్ధి ఆసుపత్రి, బీఎంసీ ఆసుపత్రి, సిద్దార్థ ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పోందుతూ ఇప్పటి వరకు 98 మంది మరణించారని పోలీసు అధికారి ధనంజయ్ కులకర్ణి అన్నారు.

ముంబై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియా కేసు దర్యాప్తు చెయ్యాలని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కల్తీ మద్యం విక్రయించిన వారు పరారైనారు. రాజు లంగ్డా అనే వ్యక్తి కల్తీ మద్యం విక్రయించాడని పోలీసులు గుర్తించారు. కల్తి మద్యం సేవించి ఇంత మంది మరణించడంతో ఉన్నత స్థాయి దర్యాప్తు చేయించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+