బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో లేడీ టెక్కీ దుర్మరణం: తల నుజ్జునజ్జు, ఉద్యోగానికి వెళ్లి !
ఉద్యోగానికి వెలుతున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగింది.
బెంగళూరు: ఉద్యోగానికి వెలుతున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగింది. బెంగళూరులో నివాసం ఉంటున్న కావ్యశ్రీ (23) అనే యువతి దుర్మరణం చెందింది.
ఎలక్ట్రానిక్ సిటీ లోని ఆక్సెస్ సాఫ్ట్ వేర్ కంపెనీలో కావ్యశ్రీ సాఫ్ట్ వేర్ ఇంజనీరు (టెక్కీ)గా ఉద్యోగం చేస్తున్నది. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే స్కూటర్ లో ఉద్యోగానికి బయలుదేరింది. మార్గం మధ్యలో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని వీరసంద్ర గేట్ దగ్గర కావ్యశ్రీ వెలుతోంది.

ఆ సందర్బంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ కావ్యశ్రీ స్కూటర్ ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో కిందపడిపోయిన కావ్యశ్రీ తల మీద అదే లారీ చక్రాలు దూసుకెళ్లాయి. హెల్మెట్ పెట్టుకున్నా అది పగలి కావ్యశ్రీ తల నుజ్జునజ్జు అయ్యి సంఘటనా స్థలంలోనే ఆమె దుర్మరణం చెందింది.
గుజరాత్ కు చెందిన కావ్యశ్రీ బెంగళూరు చేరుకుని ఉద్యోగం చేస్తోందని పోలీసులు అన్నారు. ప్రమాదానికి కారణం అయిన లారీ డ్రైవర్ ను ఎలక్ట్రానిక్ సిటి ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కావ్యశ్రీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications