వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామమందిర నిర్మాణాన్ని తెరమీదికి తెచ్చిన బిజెఫి, 95 ఏళ్ళ వయస్సులో నామినేషన్ దాఖలు

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఖేర్ ఘర్ అసెంబ్లీ స్థానం నుండి జల్ దేవీ అనే 95 ఏళ్ళ వృద్ద మహిళ నామినేషన్ దాఖలు చేశారు.చక్రాల కుర్చీలో వచ్చి ఆమె నామినేషన్ దాఖలు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఆగ్రా:ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకుగాను ప్రధాన పార్టీలు వ్యూ,హరచన చేస్తున్నాయి.అయితే ఈ రాష్ట్రం నుండి 95 ఏళ్ళ వృద్దురాలు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కనీసం నడిచే పరిస్థితి కూడ లేని ఆమె చక్రాల కుర్చీలో వచ్చి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.మరో వైపు ఈ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకొనేందుకుగాను ప్రధాన రాజకీయపార్టీలు తమ అస్త్రాలను సిద్దంచేసుకొంటున్నాయి. రామమందిర అంశాన్ని మరోసారి బిజెపి తెరమీదికి తెచ్చింది.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దేశ వ్యాప్తంగా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకుగాను ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవం చేసుకొనేందుకు బిజెపితో పాటు బిఎష్ పి, సమాజ్ వాదీపార్టీలు తమ అస్త్రాలను సిద్దం చేసుకొంటున్నాయి.

ఈ రాష్ట్రంలో మరోసారి అదికారాన్ని నిలుపుకోనేందుకుగాను సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ ప్రణాళికలను సిద్దం చేసుకొంటున్నారు.మరో వైపు ములాయం సింగ్ కు తనకు మద్య అంతరం లేదనే సంకేతాలను అఖిలేష్ ఇస్తున్నారు.

స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన 95 ఏళ్ళ వృద్దురాలు

స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన 95 ఏళ్ళ వృద్దురాలు

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి దశ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేష్ల స్వీకరణ ఈ నెల 17వ, తేది నుండి ప్రారంభమైంది. అయితే ఖేరాఘర్ అసెంబ్లీ స్థానం నుండి జల్ దేవీ అనే 95 ఏళ్ళ వృద్దురాలు స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.బుదవారం నాడు ఆమె చక్రాల కుర్చీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఓటరు దినోత్సవం రోజున స్పూర్తినిచ్చిన జల్ దేవి

ఓటరు దినోత్సవం రోజున స్పూర్తినిచ్చిన జల్ దేవి

95 ఏళ్ళ జల్ దేవి దేశ వ్యాప్తంగా పలువురికి స్పూర్తినిచ్చారు.ఓటర్ దినోత్సవం రోజున ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. జల్ దేవి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం పలువురికి స్పూర్తినిచ్చింది.2015 లో ఆమె పంచాయితీ బోర్డు మెంబర్ గా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ అసెంబ్లీ స్థానం నుండి బిఎస్ పి కి చెందిన భగవాన్ సింగ్ కుష్వాహ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

రామ మందిర నిర్మాణాన్ని తెరపైకి తెచ్చిన బిజెపి

రామ మందిర నిర్మాణాన్ని తెరపైకి తెచ్చిన బిజెపి

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని బిజెపి వ్యూహ రచన చేస్తోంది.ఈ మేరకు తన ముందున్న అన్ని రకాల అస్త్రాలను ఆ పార్టీ వినియోగించుకోనుంది. ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ లో రామమందిరం నిర్మాణ అంశాన్ని మరో సారి బిజెపి తెరమీదికి తెచ్చింది.రామమందిరాన్ని రెండు మాసాల్లో పూర్తి చేయలేం.అయితే ఎన్నికలు పూర్తైన వెంటనే మందిరాన్ని నిర్మిస్తామని ఆ పార్టీ ప్రకటించింది. తమ పార్టీ పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వస్తోందని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర బిజెపి చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య చెప్పారు.

ప్రధాన అస్త్రాలను సిద్దం చేసుకొంటున్న పార్టీలు

ప్రధాన అస్త్రాలను సిద్దం చేసుకొంటున్న పార్టీలు

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలంటే రామమందిర నిర్మాణాన్ని తెరమీదికి తెచ్చింది బిజెపి.అయితే వెనుకబడిన వర్గాలు, ముస్లింల ఓట్లను లక్ష్యంగా చేసుకొని సమాజ్ వాదీ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది. అయితే బిసిలలోని 17 ఉప కులాలను ఎష్ టి జాబితాలో చేర్చుతూ సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి అలహబాద్ కోర్టు స్టే ఇచ్చింది. మరో వైపు దళితులు , ముస్లింల ఓటు బ్యాంకు లక్ష్యంగా బిఎస్ పి పావులు కదుపుతోంది.

English summary
a 95 years old woman filed nomination from Kheraghar assembly segment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X